నటుడు కాంతారావు కష్టాలకు కారణం ఆయన చేసిన ఈ తప్పే.. !

Mamatha Reddy
తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటులు తమదైన ముద్ర వేసుకొని ప్రేక్షకులను అలరించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక వంటి పాత్రలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు మన తెలుగు లో ఉన్నారు అంటే తెలుగు సినిమా పరిశ్రమ లో నటులకు కొదువ లేదు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. అలాంటి వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ల తర్వాత వినిపించే మరొక నటుడి పేరు కాంతారావు. ఒకవైపు పౌరాణికాల్లో ఎన్టీఆర్ మరోవైపు సాంఘికాల్లో ఏఎన్నార్ లు తిరుగులేని చక్రవర్తులుగా ఏలుతున్న రోజుల్లో జానపదాలు ఎంచుకుని వాటిలో రాణించిన కథానాయకుడు కాంతారావు.
అప్పట్లో పెద్ద బడ్జెట్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు నిర్మితమయ్యేవి అయితే ఓ మాదిరి బడ్జెట్ తో నిర్మితమైన కాంతారావు సినిమాలు వాటికి పోటీగా నిలిచేవీ.. అంతగా ఆయన జానపదాలు జనాల్లో క్రేజ్ ఉండేది. కండలు తిరిగిన దేహం కత్తి తిప్పడం లో నైపుణ్యం కాంతారావు జానపద కథానాయకుడిగా నిలబెట్టాయి. అందువలనే ఆయనను కొండల కాంతారావు, కత్తి కాంతారావు అని అభిమానులు పిలుచుకునే వారు. జానపదాల్లో ఆయన రూపం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేది. ఇక సాంఘికాల్లో సోలో హీరో గానే కాకుండా మల్టీ స్టార్లలోను మెప్పించారు. పౌరాణిక చిత్రాల్లో లక్ష్మణుడిగా కృష్ణుడిగా నారదుడిగానూ కనిపించారు.
ఇలా నటుగా కొన్ని దశాబ్దాలపాటు ఆయన ప్రయాణం అమోఘంగా కొనసాగింది. అయితే దురదృష్టం కొద్దీ ఆయన దృష్టి సినిమాల నిర్మాణం పై పడింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి దిగారు. సప్త, గండరగండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతిచినుకులు వంటి సినిమాలను నిర్మించారు. వీటిలో మొదటి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ ఆయనకు నష్టాలనే తీసుకు వచ్చాయి దాని వల్ల తన కార్లను బంగలాళను అమ్ముకోవాల్సి వచ్చింది. చివరిరోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవించవలసి వచ్చింది. దీనికి తోడు ఆయన దానధర్మాలు ఎక్కువ చేయడం, మొహమాటంతో నిర్మాతల దగ్గర పారితోషకం తక్కువగా తీసుకోవడం ఆయన ఆర్థిక ఇబ్బందులకు, కష్టాలకు ఎక్కువ కారణం అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: