కెజిఎఫ్ రికార్డ్స్ ని ....  వారిద్దరూ బద్దలుకొట్టగలరా .... ??

GVK Writings
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవటం తో పాటు అన్ని భాషల్లోనూ విపరీతంగా కలెక్షన్లు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 2. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంజయ్ దత్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హోంబలె ఫిలింస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా భువన గౌడ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.
మొదటి చాప్టర్ ని మించేలా మరింత అద్భుతంగా గ్రాండ్ లెవెల్లో దర్శకుడు ప్రశాంత్ కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నారని అలానే జులై 16న విడుదల తర్వాత ఈ మూవీ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే భారీ మూవీ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 30 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమాని 2022 ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నారు.
అయితే ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక భారీ సినిమాను ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. ఇటీవల ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ తాజా మూవీ యొక్క అఫీషియల్ ప్రకటన రావడం జరిగింది. ఇక అసలు విషయం ఏమిటంటే కేజిఎఫ్ సినిమాల రికార్డ్స్ ని ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ అలానే త్వరలో రూపొందనున్న ఎన్టీఆర్ సినిమాలు ఎంతవరకు బద్దలుకొడతాయి అనే చర్చ మన టాలీవుడ్ ఆడియన్స్ లో మొదలైంది. అది అంత సులువు కాదని, కేజిఎఫ్ సినిమాలపై దేశ విదేశాల్లోని ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉందని కొందరు అంటుంటే ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ సినిమాలతోనే అది సాధ్యం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కెజిఎఫ్ సినిమాల అనంతరం ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ సినిమాలు తీస్తున్న ప్రశాంత్ నీల్, పక్కాగా కథ, కథనాల పై మరింత దృష్టిపెడితే అది సాధ్యపడే ఛాన్స్ ఉందని అంటున్నారు పలువురు ట్రేడ్ అనలిస్టులు. మరి కెజిఎఫ్ మూవీస్ రికార్డ్స్ ని ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ సినిమాలు ఎంతవరకు బద్దలు కొడతాయో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు ఆగాల్సిందే ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: