అంజలి సూద్.. ప్రపంచంలోనే గొప్ప కంపనీకి సీఈఓ.. అంతకన్నా గొప్ప తల్లి

Mamatha Reddy
అంజలి సూద్.. వీమియో కంపెనీ సీఈవో.. వీడియో హోస్టింగ్ షేరింగ్ సర్వీసెస్ ఇచ్చే అమెరికన్ కంపెనీ వీమియో. ఆరేళ్ళ క్రితం ఈ కంపెనీ లో చేరారు అంజలి. మొదట మార్కెటింగ్ హెడ్.. ఆ తరువాత జనరల్ మేనేజర్.. గత నాలుగేళ్లుగా సీఈవో. వీమియో ఈనెల 25న పబ్లిక్ షేర్స్ కి వెళ్ళింది. ఈ ఘనమైన సందర్భాన్ని ట్విట్టర్లో  చిన్న ఫోటోతో అతి శక్తిమంతంగా ప్రకటించారు అంజలి సూద్. అది ఆమె నాస్డాక్ బిల్డింగ్ ఎదురుగా నిల్చుని ఉన్న ఫోటో అయితే కాదు కొడుకుని ఎత్తుకొని తన ఆఫీసు డోర్ దగ్గర నిల్చుని ఉన్న ఫోటో. వీమియో లో మొదట చేరినప్పుడు గానీ తర్వాత ఆ కంపెనీ సీఈఓ అయినప్పుడు గానీ రెండేళ్లక్రితం ఫార్చ్యూన్ జాబితాలో 14వ స్థానంలో ఉన్నప్పుడు గానీ అంజలి నుంచి వర్కింగ్ మదర్స్ పొందిన స్ఫూర్తి బయటకు ఏమీ కనిపించలేదు.

ఇప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ షేర్ కి వెళ్లి నాస్డాక్ లో లిస్ట్ అయినప్పుడు కూడా ఆమె తన రెండేళ్ల వయసున్న కొడుకుని ఎత్తుకొని ఉన్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసుకో పోయి ఉంటే అది కూడా ఒక మామూలు విషయంగా నిలిచిపోయేది. ఫోటోతో పాటు అంజలి పెట్టిన కామెంట్ ఎలా ఉందో చూడండి. అమ్మ కాలింగ్ బెల్ కొట్టడానికి ముందే వచ్చి అదృష్టం ఆమెను హత్తుకు పోయింది అని..  పబ్లిక్ షేర్స్ కి ఓపెనింగ్ ఇవ్వడానికి ముందే తన కంపెనీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పడం ఆమె ఉద్దేశం. ఇలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను అని కూడా ఆ పోస్టులో రాశారు అంజలి.

ఒక పెద్ద కంపెనీ సీఈఓ పింక్ సూట్, బూట్లు ధరించి ఆఫీసులో తన కొడుకుని ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటో మహిళా సాధికారతకు మాత్రమే కాదు సంపూర్ణాధికారత కు ప్రతీకలా కనిపించింది. సాధారణ భాషలో చెప్పాలంటే వర్కింగ్ మదర్స్ అందరికీ ఆ ఫోటో భలే ముచ్చటగా అనిపిస్తుంది. బహుశా అంజలి లో ఎవరికి వారు తమను చూసుకుని ఉంటారు. శక్తి పొంది ఉంటారు. ఇంటిపని ఆఫీసు పని అంటూ మల్టీటాస్కింగ్ చేయడం ఏ తల్లికి సాధ్యమయ్యే పని కాదు.. కానీ పిల్లలు సాధ్యం చేయిస్తారు అని ఒక  నెటిజన్స్ తమ్సప్ ఇచ్చారు. అలసిన శరీరానికి విశ్రాంతి, అలసిన మనసుకు పిల్లలు అని మరొక మహిళ ట్వీట్ చేశారు. మొదటి ఫోటో షేర్ చేసిన నాలుగు నిమిషాలకు ఈ ఫోటోలు షేర్ చేశారు అంజలి. కంపెనీ పబ్లిక్ షేర్స్ కి వెళ్ళిన సందర్భాన్ని డైరెక్టర్స్ తో కలిసి షేర్ చేసుకుంటున్న ఆ మొదటి ఫోటో కన్నా కొడుకుని ఎత్తుకొని ఉన్న రెండో ఫోటోనే  ఎక్కువగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: