ఆ సీన్ తర్వాత కార్వాన్ లోకి వెళ్లి ఏడ్చేసిన హీరోయిన్...?

sravani
తెలుగు ఇండస్ట్రీలో రాశీ ఖన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు. దాంతో అలా అలా కాలం గడిపేస్తుంది రాశీ. ఈ మధ్యే తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే వెంకీ మామ సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం ఈమెను నిరాశ పరిచింది.

తన అందం ,అభినయంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రాశి ఖన్నా.కెరీర్ ఆరంభించిన మొదట్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తర్వాత నాజూగ్గా మారింది.ఇదిలా ఉండగా రాశి ఖన్నా వెండితెరపై గ్లామర్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది కానీ దానికోసం హద్దులు దాటి గ్లామర్  షోకి రొమాంటిక్ సన్నివేశాలకు రాశి ఖన్నా కొంచెం దూరం అనే చెప్పాలి. రాశిఖన్నా తాజాగా నటించిన వెంకీ మామ ,ప్రతి రోజు పండగే చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోగా విజయ్ దేవరకొండ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం నిరాశపరిచింది.ఈ చిత్రంలో రాశిఖన్నా తనకు ఇష్టం లేని ఓ బెడ్ సీన్ లో నటించింది .

 ఆ సీన్ నటించే సమయంలో తన అనుభవాలని రాశి  ఓ ఇంటర్వ్యూ లో పంచుకుంది. ఇంటిమేట్ సీన్ లో నటించబోతున్నాను అని ముందు రోజు అమ్మతో చెప్పాను. అప్పుడు అమ్మ ఆ రోజు రాత్రంతా నిద్ర పోలేదు . అప్పుడు నేను అమ్మకు సినిమాలో ఇదంతా ఒక భాగం అని చెప్పాను.కానీ ఆ సన్నివేశం చేస్తున్నపుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు మాత్రమే తెలుసు . ఆ సీన్ పూర్తి అవ్వగానే వ్యాన్ లోకి వెళ్లి ఏడ్చినట్లు రాశి ఖన్నా తెలిపారు .ఇక తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో తన అనుభవాన్ని పంచుకుంది.

ఏ చిత్రం చేసినా నాకంటూ కొన్ని పరిధులను ఏర్పర్చుకున్నాను కానీ ఈ చిత్రం కోసం నేను నా లిమిట్స్ దాటాల్సి వచ్చింది అని రాశి తెలిపారు . విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సీన్ అని చెప్పగానే అమ్మా నాన్న చాలా కంగారు పడ్డారు .అప్పుడు నేను ఇదంతా పట్టించుకోకండి సినిమా అంటే ఇదొక పార్ట్ అని చెప్పాను .అప్పుడు విజయ్ నాకు చాలా దైర్యం చెప్పాడు .విజయ్ మాటలతో కొంచెం కూల్ అయ్యాను కానీ నేను రాశి ఖన్నాను నన్ను ప్రేక్షకులు నాలానే చూడాలనుకుంటారు .అలాంటి సన్నివేశాలు చెయ్యడం నాకు కూడా ఇష్టం లేదు అని రాశి ఖన్నా తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: