రాశీ ఖన్నాకు 16 ఏళ్ళకే ఆ అనుభవం బాయ్ ఫ్రెండ్ తో అలా..?

sangeetha
తెలుగు ఇండస్ట్రీలో రాశీ ఖన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు. దాంతో అలా అలా కాలం గడిపేస్తుంది రాశీ. ఈ మధ్యే తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే వెంకీ మామ సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం ఈమెను నిరాశ పరిచింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యే ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టింది ఈ బ్యూటీ. ఆ మధ్య ఇండియన్ క్రికెట్ టీం సభ్యుడు జస్ప్రీత్ బూమ్రాతో డేటింగ్ చేస్తుందని గాసిప్స్ వచ్చాయి.. దీనికి కారణం రాశీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఆ యంగ్ బౌలర్ ఫాలో కావడమే. అప్పట్లో సంచలనమైన ఈ వార్తను రాశీ లైట్ తీసుకుంది. బూమ్రా, నేను జస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఈ మధ్యే మరోసారి కూడా ఇలాంటి వార్తలే రావడంతో మరోసారి తన ఎఫైర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది రాశీ ఖన్నా.తాను ఏ ఇంటర్వ్యూకు వచ్చినా కూడా తప్పకుండా అడిగే ప్రశ్న డేటింగ్ గురించే అని.తను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేనని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.

తాను తన 16వ ఏటనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని సంచలన విషయాలు చెప్పింది రాశీ. తను ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి తింటున్నంత సేపు తనను పొగుడుతూనే ఉన్నాడని చెప్పింది. అతడు తన క్లాస్‌మేట్ అని.. ఇద్దరిదీ ఒకే వయసని.. అయితే తర్వాత అనుకోని కారణాలతో దూరమయ్యామని చెప్పింది.మొత్తానికి తను పదహారేళ్లకే డేటింగ్ చేసి తర్వాత విడిపోయామని చెప్పడంతో ఎవరతను అనేది తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు స్నేహితులు తప్ప ప్రేమికులు లేరని చెప్పింది ఈమె. గ్లామర్ షో విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది రాశీ. తనకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావాలని.. కానీ కొందరు గ్లామరస్ పాత్రలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం గ్లామర్ షోలో హద్దుల్లోనే ఉంటానని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: