అందరు మెచ్చిన ఈ కమెడియన్ రైలు పట్టాలపై శవమై కనిపించాడు

Mamatha Reddy
సినీ పరిశ్రమకు ఎంతో మంది నటులు, హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు వచ్చారు. కొందరు హీరో అవుదామని వచ్చి.. విలన్ రోల్స్ చేసిన వాళ్లు ఉన్నారు. మరికొందరు హీరో గా అవకాశాలు రాకపోయేసరికి కమెడియన్ గా స్థిరపడిపోయిన వాళ్లూ ఉన్నారు. కానీ ఎంత మంది వచ్చి వెళ్లిపోయినా.. కొందరికే ఆ మార్క్ ఇమేజ్ ఉంటుంది. తమ నటనను ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది. విభిన్నమైన పాత్రలు చేస్తూ అభిమానులను సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి రేర్ నటుల్లో నిన్నటి తరం కేవీ చలం ఒకరు.
చలం తనకున్న ప్రత్యేకమైన నటనాచాతుర్యంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో కామెడీ చేసేవారు. కొన్ని సినిమాల్లో హీరోగానూ చేశాడు.
చలం అంటే దర్శకరత్న దాసరినారాయణరావుకు ఎనలేని అభిమానం. తన సినిమాల్లో కారెక్టర్ లేకపోయినా.. చలం కోసం ప్రత్యేకంగా పాత్రను సృష్టించేవారంటే ఆయన మీద దాసరికున్న అభిమానమెంతో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి దాసరి నారాయణ అద్దాల మేడ సినిమా తీస్తుండగా.. చలం చనిపోయారనే వార్త తెలిసింది. అంతే దాసరి నారాయణ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన చనిపోయిన తీరు గురించి విని నమ్మలేకపోయారు. ఇదంతా అబద్దమైతే బాగుండు అని లోలోపలే కుమిలిపోయారు.
చలం ఓ రోజు రైలు పట్టాలు దాటుతూ రైలు కింద పడి చనిపోయారు. ఈ విషయం తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దాసరి నారాయణరావు అయితే నమ్మలేకపోయాడు. అద్దాల మేడ షూటింగ్ నుంచి వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆయనకు అంతిమయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత చలం కుటుంబానికి దాసరి ఆర్థికంగా సాయం చేశారు. అలా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి నారాయణకు చలం అంటే ఎనలేని అభిమానం. ఆయన చనిపోయాక కూడా చలాన్ని మర్చిపోలేకపోయారు. చాలా సందర్భాల్లో చలాన్ని గుర్తుచేసుకునేవారు. చలం  లాంటి కమెడియన్ ఇండస్ట్రీ లో లేరని .. అది పరిశ్రమకు తీరని లోటుగానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: