'అల్లుడు' కొట్టిన దెబ్బకు బాలయ్య ఏమంటాడో ?(

Chaganti
సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆయనకు చెప్పుకోదగ్గ సినిమా అంటే ఒక్కటే అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత తెరకెక్కించిన రభస సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ తో హైపర్ అనే సినిమా చేసినా అది కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా భారీ దెబ్బ వేసింది. సంక్రాంతి కానుకగా 14వ తేదీ రిలీజ్ అయిన ఈ సినిమా కందిరీగ 2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కందిరీగ సినిమా తీసింది తానేనన్న విషయం మరిచిపోయి అదే కధని అటూ ఇటూ మార్చేసి మరలా అల్లుడు అదుర్స్ సినిమాని తెరకెక్కించారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుంది అన్న ఉద్దేశంతో ఉన్న సంతోష్ శ్రీనివాస్ బాలకృష్ణకి ఒక కథ వినిపించాడు. బాలకృష్ణ కూడా కథ నచ్చడంతో ఈ సినిమా త్వరలోనే అనౌన్స్ చేయొచ్చని కూడా భావించారు. అయితే ఇప్పుడు ఈ అల్లుడు అదుర్స్ కొట్టిన దెబ్బకు బాలకృష్ణ మళ్లీ సంతోష్ తో సినిమా చేస్తాడా చేయడా ? అనేది ఆసక్తికరంగా మారింది. 

నిజానికి బాలకృష్ణ సరే అనడంతో ఈ సినిమాకి సంబంధించి కధ కూడా సంతోష్ శ్రీనివాస్ పూర్తి చేసేశాడని అంటున్నారు. ఎందుకంటే అల్లుడు అదుర్స్ దెబ్బ వేసిన ఇలాంటి సమయంలో బాలకృష్ణ కనుక ఈయన ఫ్లాప్ ని పరిగణలోకి తీసుకుని తాను సినిమా చేయలేనని చెబితే ఇబ్బందుల్లో వెళ్లడం ఖాయం. ఎందుకంటే ఆయన ఆ స్క్రిప్ట్ తోనే మరో హీరోని ఒప్పించుకోవాల్సి ఉంటుంది. లేదా మరో హీరోతో సినిమా చేయాలంటే మరో కొత్త కథ రాసుకోవాలి ఉంటుంది. అలా రాసుక్న్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మరో హీరోని కథ చెప్పి ఇంప్రెస్ చేయగలరా అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: