ఆకట్టుకుంటున్న సంక్రాంతి బరిలో దిగిన సినిమా పోస్టర్లు.. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..

savitri shivaleela
2020 సంవత్సరంలో సినిమాల జోరు పూర్తిగా తగ్గిపోయింది. వందల సినిమాలతో థియేటర్లను షేర్ చేసే సినీ ఇండస్ట్రీ ఆ ఏడాదిలో మూగబోయింది. కరోనా మహమ్మారి కారణంగా జనాలతో కళకళలాడాల్సిన థియేటర్లలన్నీ మూతపడ్డాయి. కరోనా విస్తరించడం.. లాక్ డౌన్ పెట్టడంతో థియేటర్లన్నీ కొన్ని నెలలుగా మూతపడ్డ సంగతి తెలిసిందే. అన్ లాక్ తర్వాత తెరకెక్కిన సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ ఫాంపైనే రిలీజ్ అయ్యాయి. కానీ అందులో రిలీజైన సినిమాలు దాదాపుగా అట్టర్ ప్లాప్ గానే నిలిచాయి. తిరిగి థియేటర్లు తెరచుకోవాలని సినీ ఇండస్ట్రీ ఎంతో ప్రయత్నం చేసింది. కొన్ని నిబందనలతో థియేటర్లను ఓపెన్ చెయ్యడానికి ప్రభుత్వం కూడా పర్మీషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ చాలా కాలం తర్వాత.. అందులోనూ కరోనా కాలంలో థియేటర్లలోకి ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తారన్న నమ్మకం సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. ఎవరో ఒకరు తమ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే కాని ముందుడుగు వేయలేదు దర్శక నిర్మాతలు..
అలాంటి సమయంలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి తన సినిమానే థియేటర్లలో రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకులు వస్తారో రారో నన్న సందేహం తో ఉన్న ఈ చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయే రేంజ్ లో జనాలు వచ్చి ఈ సినిమాను తిలకించారు. చూడటమేకాదు.. బ్లాక్ బస్టర్ హిట్ గా  చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు జనాలు. దాంతో మిగతా హీరోలు, దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మాంచి హిట్ ను సంపాదించగా, మాస్ మహారాజా ‘క్రాక్ ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ హిట్ లతో థియేటర్లు కూడా మునపటి శోభను సంతరించుకున్నాయి. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు రామ్ ‘రెడ్’, బెల్లంబాబు‘అల్లుడు అదుర్స్’ సినిమాలు గురువారం రిలీజ్ అయ్యాయి. దీంతో తెలుగు పరిశ్రమలో సంక్రాంతికి కళ సంతరించుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే సంక్రాంతి బరిలో కొన్ని సినిమా పోస్టర్లు కూడా రిలీజై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ప్రేక్షకులను మెప్పించిన పోస్టర్లపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.. సంక్రాంతి బరిలో దిగిన కొత్త పోస్టర్లలో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటించిన‘లవ్ స్టోరీ’, ఇచ్చట వాహనములు నిలుపరాదు, అనగనగా ఒక రౌడీ, శశి, నితిన్ , కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్ దే’, క్రాక్, సీటీమార్, వరుడు కావలెను, కపటధారి, ఛిల్ బ్రో, లక్ష్యం, నువ్వుంటే నా జతగా, ఇదే మా కథ వంటి మరిన్ని టాలీవుడ్ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: