ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తున్నన రకుల్

savitri shivaleela
ఒకవైపు బాలీవుడ్ లోనూ, మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఊపుమీద దూసుకుపోతోంది పరేషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరును సంపాధించుకుంది. తన నటనతో టాప్ హీరోయిన్ గా మాంచి గుర్తింపు తెచ్చుకుందీ ఈ బ్యూటీ క్వీన్. చురకత్తులాంటి చూపులతో.. మత్తేకించే శరీరాకృతితో ఈ ముద్దుగుమ్మ అందిరినీ కట్టిపడేస్తుంటుంది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ సినిమాలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. భాషతో సంబంధం లేకుండా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతితక్కువ కాలమే అయినా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది.

చిన్న, పెద్ద అనే తేడానే లేకుండా అందరి హీరోలతో కలిసి సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది రకుల్.  అందుకే ఈ బ్యూటీక్వీన్ కు చేతినిండా సినిమాలున్నాయి. అందులోనూ టాలీవుడ్ లోకంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది.  ప్రొడ్యూసర్లలోనూ మంచి పేరును తెచ్చుకుంది ఈ చిన్నది.  రెమ్యూనరేషన్ విషయంలోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందట. అందుకే ఈ ముద్దుగుమ్మ అంటే అంత ఇష్టం అభిమానులకు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందరి ముద్దుగుమ్మలల లాగా ఒకే లాంగ్వేజీకి పరిమితం కాలేదు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం నుంచి ఆఫర్లను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే టైం కుదిరినప్పుడల్లా తన అందచందాలతో కిక్కెక్కించే ఈ ముద్దుగమ్మ తాజాగా మరోసారి తన అభిమానులకు నయనానందం కలిగించిందనే చెప్పుకోవచ్చు. ప్రముఖ ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ జనవరి మ్యాగజైన్ కోసం అదిరిపోయే హాట్ లుక్ కు ఫోజులిచ్చింది రకుల్. అందులో ఈ చిన్నది చిన్న గౌన్ తో చురకత్తులాంటి చూపుతో చూపరులను ఆకట్టుకునే విధంగా మ్యాగజైన్ ఫోటోకు పోజులిచ్చింది. ఈ చిన్నది ఇచ్చిన హాట్ ఫోటో ఫోజుకు ఆమె అభిమానులను అబ్బా.. అనిపించేలా చేస్తోంది. దాంతో హాట్ హాట్ గా కనిపించిన రకుల్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: