పాపం మారుతి అడకత్తెరలో పోక చెక్కయ్యాడుగా !

Chaganti
ఎక్కడో స్టిక్కరింగ్ వేసుకునే స్టేజ్ నుండి ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు మారుతి. బన్నీకి డ్రాయింగ్ టీచర్ గా ఆయన ఎంటర్ అవడం జీవితాన్ని మార్చేసింది. ఆయనలో దర్శకత్వ ప్రతిభ ఉందని గుర్తించిన బన్నీ ఆయనను ఆ విధంగా ప్రోత్సహించాడు. అయన ప్రోత్సాహంతో ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తిరిగి వెనక్కు చూసుకోలేదు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. చివరిగా సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజూ పండగే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.


 ఇక ఈయన ఆ తరువాత మరే సినిమా అనౌన్స్ చేయలేదు. ఇక ఈయన రాసుకున్న ఒక కధ ఈయనను అడకత్తెర లో పోక చెక్కను చేసేసింది అనే చెప్పాలి. విషయం ఏంటంటే మామూలుగా ఏదయినా ఒక కధ అనుకున్నప్పూద్ అది ఒక హీరోతోనే లాక్ అయిపోతుంది. ఒక్కోసారి ఆ కథ చాలా మంది హీరోల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రస్తుతం మారుతి రాసుకున్న కథ కూడా అందరు హీరోల దగ్గరకు తిరగాల్సి వస్తోంది. మారుతి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ ను రెడీ చేసాడు. ముందుగా ఈ సినిమాలో హీరోగా రామ్ ను అనుకున్నాడు.


 రామ్ ని కలిసి కధ కూడా చెప్పాడు. రామ్ కి కధ నచ్చినా సరే  ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు చేసే ఇంటరెస్ట్ రామ్ కి లేదు. దీంతో ఆ కథ మాస్ మహారాజా రవితేజ వద్దకు వెళ్ళింది. రవితేజకు ఈ కథ బాగా నచ్చినా రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఈ కథ గోపీచంద్ వద్దకు వెళ్ళింది. అయితే గోపీచంద్ కూడా ఈ కథలో మార్పులు చేర్పులు చెబుతుండడంతో మారుతి ఆయనని కూడా వద్దనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరితో చేయాలో తెలియక టెన్షన్ లో ఉన్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: