గంగవ్వ లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడుతుందా.. అసలు ఏమైంది?

Satvika
బిగ్ బాస్ 4 ఐదో వారం ఎలిమినేషన్ కూడా అయిపొయింది.. ఈ వారం లో సుజాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాగా,మరో స్ట్రాంగ్ కంటే స్టెంట్ గంగవ్వ కూడా అనారోగ్యం కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అలా ఇంటి నుంచి ఇద్దరు బయటకు వెళ్ళారు. ఎప్పటి లాగా ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇంటి సభ్యులు ఏదోక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తారన్న సంగతి తెలిసిందే.. గతంలో ఎలిమినేట్ అయిన వారంతా బిగ్ బాస్ పై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

తాజాగా గంగవ్వా కూడా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.  ఈ మేరకు కొన్ని సంచలన నిజాల ను బయట పెట్టింది. రాహుల్ సిప్లిగంజ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు గంగవ్వ. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి విషయాలను మొదలకొని ఒక్కో ఇంటి సభ్యుడి బాగోతాన్ని బయట పెట్టింది. ఈ మేరకు అఖిల్, మోనాల్ గురించి షాక్ అయ్యేలా కొన్ని నిజాలను చెప్పింది. ఇంట్లో ఉన్న వారిలో కుమార్ సాయి ఒక్కడే ఆటను నిజాయితీగా ఆడతాడు. అతనే విన్నర్ అవుతాడని అనిపిస్తుంది.. అంటూ గంగవ్వ బాంబ్ పేల్చింది..

ఇకపోతే ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది.. బిగ్ బాస్ ఇచ్చిన ఎండు మిరపకాయలు దండను నామినేట్ చేసిన వారి మెడలో వేసి, ఎందుకు నామినేట్ చేశారు అన్న విషయాలను బిగ్ బాస్ కు చెప్పాలి.. ఈ క్రమం లో అందరూ కూడా ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.జనాల అభిప్రాయం మాత్రం సోహైల్ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నారు. కొందరు హారిక బయటకు వస్తుందని అంటున్నారు.. రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్ళేది ఎవరు అనే తెలియాలంటే ఈ వారం మిస్ అవ్వకుండా బిగ్ బాస్ షో ను చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: