చల్లని వాతావరణంలో హీట్ పుట్టిస్తున్న రాశీ ఖ‌న్నా.!

Kothuru Ram Kumar
చక్కనమ్మ చిక్కినా అందమే.. ఇది పాత చింతకాయ పచ్చడి. బొద్దుగుమ్మ నాజూకైనా అందమే.. ఇది నేటి తరం నేతి బీరకాయ లెక్క. అర్ధమయ్యే ఉంటుంది కదా. లేదంటే ఈ మేటర్ చదవండి. మీకే బోధపడుతుంది. మొదటి సినిమా "ఊహలు గుస గుసలాడే" సినిమాలో కొంచెం ముద్దుగా.. బొద్దుగా వున్న రాశీ ఖన్నా, అనతి కాలంలోనే సైజ్ జీరోతో కుర్ర కారుని ఉక్కురి బిక్కరి చేసింది. లాంచింగ్ సినిమాతోనే తన గ్లామర్, నటనతో తెలుగు సినిమా పరిశ్రమలో పాగా వేసేసింది.
మొదటి నుండి కొంచెం అందాల ఆరబోత పాత్రలకు దూరంగా వున్న రాశీ, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంలో రౌడీ బోయ్ విజ‌య్ తో రొమాన్స్, కిస్‌లు, హ‌గ్‌లతో సిల్వర్ స్క్రీన్ పైన తెగ రెచ్చి పోయింది. ఎప్పుడూ సంప్ర‌దాయంగా కనిపించే రాశీని ఒక్క‌సారిగా అలా చూసిన  అభిమానులు  తట్టుకోలేక పోయారు. సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడిని తెగ ట్రోల్ చేసేసారు. ఓ టైం లో వారికి రాశీ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి కూడా వచ్చేసింది.

ఈ క్రమంలోనే మ‌రోసారి తాను అలా ఆ రకమైన పాత్రలు చేయడానికి ఒప్పుకోనని మాటిచ్చింది. కానీ ఇపుడు తాను ఆ మాటలను వెనక్కి తీసుకున్నట్టుంది. ఇంతకీ విషయం ఏమిటని అనుకుంటున్నారా.. ఆమె తాజాగా రిలీజ్ చేసిన ఫోటోల‌ను చూస్తుంటే రాశీ గ్లామ‌ర్ షోకి బహు సిద్దంగానే ఉన్న‌ట్టు బోధ పడుతోంది. కాగా.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రెండు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. అలాగే ఓ 3, 4 తెలుగు సినిమాలకు కూడా సైన్ చేసిందని భోగట్టా.
ఇకపోతే, తాజాగా రాశీ ఖ‌న్నా వివిధ భంగిమల్లో వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ కుర్రకారుని కిర్రెక్కించే ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి 'చ‌లి కాలం' అనే కామెంట్ పెట్టడం కొసమెరుపు. అంటే చ‌లికాలంలో త‌న ఫోటోలతో కుర్రాళ్ళ మనసుల్లో మంట పెట్టాలని చూస్తోంది. కాగా ఈ ఫోటోలు తిలకిస్తున్న సదరు అభిమానులు కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, కొందరు మాత్రం రాశీ.. ఇచ్చిన మాటను తప్పిందని కొంచెం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: