గ్లామర్ పాత్రల్ని పూర్తిగా పక్కనపెట్టిన తాప్సి.. కారణం ఏంటంటే?

Deekshitha Reddy
హీరోయిన్ తాప్సికి తెలుగులో గ్లామర్ డాల్ గా పేరుంది. తొలి సినిమాతోపాటు.. ఆ తర్వాత వరుసగా చేసిన చిత్రాలన్నిటిలో ఆకట్టుకునే పాత్రలతో మెప్పించింది తాప్సి. బాలీవుడ్ బాటపట్టాక ఆమె పూర్తిగా మారిపోయింది. రియల్ లైఫ్ పాత్రలతోపాటు, డీగ్లామర్ క్యారెక్టర్స్ ని ఎంచుకుంటోంది. విచిత్రంగా తెలుగులో వచ్చిన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా హిందీ చిత్ర పరిశ్రమలో తాప్సి పేరు తెచ్చుకుంటోంది. నటిగా తనని తాను నిరూపించుకుంటోంది.
ప్రస్తుతం తాప్సి ప్రధాన పాత్రలో నటించిన రష్మి రాకెట్ అనే సినిమా సెట్సే పై ఉంది. గతంలోనే  ఈ సినిమా మొదలైనా కరోనా వల్ల అగిపోయింది. అయితే సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చింది తాప్సి. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందని ప్రకటించింది తాప్సి. గతేడాది ఈ సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ కూడా వదిలారు దర్శక నిర్మాతలు. అయితే అనుకోకుండా బ్యాలెన్స్ పార్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్ నుంచి మళ్లీ తాప్సి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తోందనమాట.
ఇటీవలే థప్పడ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది తాప్సి. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడే ఇల్లాలి పాత్రలో మెప్పించింది. అంతకు ముందు సౌండ్ కీ ఆంఖ్ సినిమాలో వయసుమళ్లిన షూటర్ గా కనిపించి ఆకట్టుకుంది తాప్సి. తన వయసుకి పైబడిన పాత్రలు చేస్తున్నా, గ్లామర్ డోస్ కి అవకాశం లేకపోయినా తాప్సిని మాత్రం అభిమానులు మరచిపోలేకపోతున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం కంగనా రనౌత్ కి పోటీగా తాప్సి ఇలాంటి స్టోరీ బేస్డ్ సిినిమాలు చేస్తోంది. గ్లామర్ క్యారెక్టర్స్ కి వచ్చిన గుర్తింపుకంటే.. ఇలాంటి కథాబలం ఉన్న సినిమాల వల్లే తనకి మంచి గుర్తింపు వస్తోందని చెబుతోంది తాప్సి. అందుకే తన జర్నీని ఇలా మలుపు తిప్పిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: