చిరూ భార్యగా ఆకట్టుకున్న సిమ్రాన్

Gullapally Venkatesh

తెలుగులో ఈ తరానికి పెద్దగా సిమ్రాన్ పరిచయం లేదు గాని ఆమె మాత్రం కిందటి తరం యూత్ కి బాగానే  నచ్చిన హీరోయిన్. ఆమె అందం ఆమె నటన అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆమె యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని కెరీర్ లో దూసుకుపోయారు అనే చెప్పాలి. అయితే అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకుని ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయి సినిమాలకు ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇక ఆమె చిరంజీవి కి భార్యగా నటించారు. మృగరాజు సినిమాలో చిరంజీవి భార్య గా ఆమె పోషించిన పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. 

 

ఆ సినిమా ఫ్లాప్ అయింది గాని ఆమె పాత్రకు మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఆయన భార్యగా ఆమె కరెక్ట్ గా సరిపోయింది అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసారు అప్పట్లో. ఆ సినిమా భారీ అంచనాలతో  వచ్చి ఫ్లాప్ అయింది కాని సినిమా మాత్రం యూత్ ని బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. చిరంజీవి పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. కథలో కాస్త బలం ఉండి ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అయి ఉండేది అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. టాలీవుడ్ లో అది ఒక ప్రయోగం అని చాలా మంది ఇప్పటికి కూడా అంటారు. 

 

ఆ సినిమాలో చిరంజీవి కాస్త సాహసాలు చేసారు  గాని అవి జనాలకు అంతగా నచ్చలేదు. అప్పటి వరకు మాస్ హీరో గా మంచి గుర్తింపు ఉన్న చిరంజీవి సడెన్ గా అలాంటి పాత్ర చేయడం చాలా మందికి నచ్చలేదు అనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత చిరంజీవి కాస్త జాగ్రత్త పడ్డారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: