హీరో, హీరోయిన్‌కు మూకుమ్మడిగా దాడి చేసిన కరోనా వైరస్.. తీవ్ర దిగ్బ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.!

Kothuru Ram Kumar

ప్రపంచ దేశాలన్నిటిని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్.. భారత్ లోను విస్తరిస్తోంది. అయితే దీనికి తగు జాగ్రత్తలు కేంద్రం తీసుకుంటోంది. అయినా ఏదో మూల ఎవరికో ఒకరిని ఈ వైరస్ ఎటాక్ చేసిందనే వార్తలను మనం వింటూనే వున్నాం. ఇప్పటికే జపాన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం.. ఇంకా పలు దేశాల్లో శర వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 

 

చైనాలో ఉద్భవించి, ప్రపంచ దేశాలకు పాకిన ఈ మహమ్మారి వేలాది మందిని బలి తీసుకుంది.  ప్రస్తుత లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షా 25 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు అంచనా. అయితే తాజా సమాచారం ఏమంటే... ఈ వైరస్ ప్రముఖ హీరో దంపతులకు సోకినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారే.. ప్రముఖ హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌... వారు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం.

 

ఇటీవల వీరు అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్‌లో భాగంగా... వీరికి జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో కూడిన ఇబ్బందులు రావడంతో.. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వారిని  వాళ్లను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసి హాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు సమాచారం.

 

ప్రస్తుత సమాచారం ప్రకారం... ఈ వైరస్ కారణంగా అమెరికాలో 38 మంది చనిపోగా.. ఇంకా పలువురు ఈ వ్యాధి బారిన పడి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇపుడు తాజాగా టామ్ దంపతులకు సోకడం పట్ల పలువురు సినీ ప్రముఖులు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటంతో... సింగర్ సీలైన్ డియాన్, తన షోను మరో రెండు నెలలకు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: