ఇదే రైట్ టైం దమ్ముంటే దండుకోవడమే ..!

Kunchala Govind

ఈ సంవత్సరం సంక్రాంతికి భారీ సినిమాల ద్వారా భారీ సక్సస్ లు వచ్చి తెలుగు సినిమాకి గొప్ప ప్రారంభాన్నిచ్చాయి. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా రిలీజైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో వంటి రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఒక సినిమాకి ఒకటి గట్టి పోటీగా నిలబడుతూ రెండూ భారీ వసూళ్ళను సాధించాయి. అంతేకాదు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆ రెండు సినిమాల ప్రారంభంజనం ఫిబ్రవరిలోనూ కంటిన్యూ అయింది. ఇక ఎన్నో అంచనాలతో రిలీజైన జాను, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఘోరంగా ఫ్లాపయ్యి సత్తా చాటకపోయినప్పటికి నెలాఖరున వచ్చిన నితిన్ భీష్మ హిట్ టాక్ ని తెచ్చుకుని నితిన్ కి ఉత్సాహాన్నివ్వడం మాత్రమే కాదు కమర్షియల్ సక్సస్ ని దక్కించుకుంది. 

 

అయితే ప్రస్తుతానికైతే మార్చ్ నెలలో రిలీజ్ అవడానికి పెద్ద సినిమాలు ఏవీలేవు. ఒక్క నాని సినిమా తప్ప మిగతావన్నీ చిన్న సినిమాలు కావడం ఆసక్తికరమైన విషయం. నాని వి కూడా మార్చ్ చివరి వారంలో రిలీజ్ కాబోతుంది. అప్పటి వరకు థియేటర్స్ లో సందడి చేసేవన్ని చిన్న సినిమాలే. మార్చ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు నాలుగు ఉంటే ఆ సినిమాలలో మూడు సినిమాలు ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతున్నాయి.

 

పలాస, ఓ పిట్ట కథ, అనుకున్నదొకటి అయినదొకటి వంటి సినిమాలు మార్చ్ 6వ తేదీన విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మార్చ్ 6 తర్వాత 25 వరకు సినిమాలే లేకపోవడం ఆశ్చర్యకరం. ఆ టైమ్ లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బిజీలో ఉండడం వల్ల ఫ్యామిలీస్ థియేటర్లకి రారన్న ఉద్దేశ్యంతో ఆ డేట్స్ ని పెద్ద సినిమాల మేకర్స్ ఏ సినిమాకి డేట్ లాక్ చేసుకోకుండా వదిలేశారు. అయితే లో బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు రిలీజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని ఈ టైం లో గనక పక్కాగా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తే కథలో దమ్మున్న చిన్న సినిమాలకి మంచి లాభాలొస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: