అశ్వథ్థామ ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టిందిగా..

ఛలో తరువాత వరస  డిజాస్టర్లను చవి చచూసిన నాగశౌర్య , అశ్వథ్థామ తో  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోగా  నిన్న విడుదలైన ట్రైలర్ అంతకు మించిన రెస్పాన్స్ తో ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొట్టింది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 10కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా ఆడియో , డిజిటిల్ ,శాటిలైట్ హక్కుల రూపంలో 6.20కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.
 
నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అతి త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది. ఈచిత్రంలో శౌర్య సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా  క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం లో మెహ్రీన్ కథానాయికగా నటించగా  శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మరి మంచి అంచనాలతో జనవరి 31న  వస్తున్న ఈ చిత్రం విజయం సాధించి శౌర్య ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. 
ఇక నాగశౌర్య  ప్రస్తుతం మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో తనకు  ఊహలు గుస గుస లాడే  లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాలతో  రెండో సినిమా చేస్తుండగా నూతన దర్శకురాలు లక్ష్మి సౌజన్య  డైరెక్షన్ లో కూడా శౌర్య ఓ  సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైమెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ రెండు సినిమాల తోపాటు సుబ్రహ్మణ్యపురం ఫేమ్  సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో నటించడానికి  నాగశౌర్య ఓకే చెప్పాడు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: