హిట్ హీరో.. ఫ్లాప్ డైరెక్టర్ వైపు చూస్తున్నాడా..?

NAGARJUNA NAKKA

ఏ హీరోకైనా హిట్ అనేది టార్గెట్. హిట్ వస్తే చాలు వరుసగా కొత్త సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం హిట్ వచ్చినా కూడా ఎందుకో కొత్త సినిమాను మొదలు పెట్టడం లేదు. ఇద్దరు ప్లాప్ దర్శకులతో కొత్త సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తున్నా.. ఆ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. 

 

హీరోగా ఎంట్రీ ఇస్తూనే హై బడ్జెట్ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఓన్లీ హై బడ్జెట్ లను నమ్ముకొని సినిమాలు ఆడవనే సంగతి ఈ యంగ్ హీరోకి త్వరగానే తెలిసొచ్చింది. దీంతో రూట్ మార్చి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలపై కాన్సన్ ట్రేషన్ చేశాడు. ఈ క్రమంలో ఐదు ఫ్లాప్స్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది రాక్షసుడితో మంచి విజయం అందుకున్నాడు. అయితే హిట్ తర్వాత కూడా ఈ కుర్ర హీరో కెరీర్ ముందుకు సాగడం లేదు. 

 

తమిళ సినిమా రాక్షసన్ రీమేక్ గా వచ్చిన రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ బాబు అందరినీ మెప్పించాడు. ఈ సినిమా ముందు వరకు సాయి శ్రీనివాస్  సినిమాలంటే కేవలం ఫైట్స్ పాటలు తప్పా కథ ఉండదనే టాక్ ఉండేది. కానీ రాక్షసుడు సినిమాతో బెల్లంకొండ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత ఈ యంగ్ హీరో దిల్ రాజు బ్యానర్ తో పాటు ఓ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. 

 

ఆ మధ్య కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు వినిపించింది. కానీ అది కూడా కన్ ఫార్మ్ కాలేదు. ఇప్పుడు కొత్తగా శీనువైట్ల తర్వాతి సినిమా చేయబోతున్నట్టు వినబడుతోంది. కానీ ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఫ్లాప్ వచ్చినపుడు వెయిటింగ్ తప్పదు. కానీ ఓ హిట్ వచ్చాక శ్రీనివాస్ మరీ ఇంతలా వెయిట్ చేయడం ఏంటనే టాక్ వినిపిస్తోంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: