బాబోయ్.. కంగనా ఏంటిలా.. !!
బాలీవుడ్ క్వీన్ గా దూసుకుపోతున్న కంగనా సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. గతంలో ఏక్ నిరంజన్ సినిమా చేసింది. ఈ సినిమా సౌత్ లో పెద్ద హిట్ కాలేదు. దీని తరువాత కంగనా బాలీవుడ్ లో బాగా బిజీకావడంతో సౌత్ సినిమాలవైపు చూడలేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ హీరోలపైన, హీరోయిన్లపైనా విమర్శలు చేస్తూ రచ్చ చేస్తుంది. మణికర్ణిక సినిమాకు ఆమె దర్శకత్వం వహించి మెప్పించింది. ఈ సినిమా తరువాత కూడా మరో రెండు సినిమాలు చేసి మెప్పించింది కంగన.
ఈ సినిమా తరువాత కంగనా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. కోలీవుడ్ లో అమ్మ జయలలిత బయోపిక్ సినిమా చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టారు. జయలలిత మేకప్ కోసం హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ లు వచ్చి మేకప్ చేశారు. జయలిత జీవితం మొత్తాన్ని మూడు గంటల్లో వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమాపై అంచనాలు ఉన్నాయి.
కాగా, ఈ సినిమాకు సంబంధించిన జయలలిత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జయలలితను కంగనా దించేసింది. సినిమల్లోకి ఎంట్రీ ఇచ్చినపుడు ఆమె ఎంత యాక్టీవ్ గా అగ్రెసివ్ గా ఉండేదో ఒక్క షాట్ లో చూపించారు. ఇక 1991లో ఆమె ముఖ్యమంత్రి అయ్యాక ఎంత సైలెంట్ గా ఉన్నదో ఆమె పేస్ లో ఎంతటి గాంభీర్యత ఉన్నదో దాన్ని కూడా ఒక ఫ్రేమ్ లో చూపించారు. అమ్మ జయలలిత సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. కంగనా ఈ సినిమా కోసం తమిళం నేర్చుకున్నది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆమె ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నది. ఇక ఇందులో ఎంజీఆర్ గా అరవింద్ స్వామి కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ గా ఎవరు చేయబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నది. ఎన్టీఆర్ తన పాత్ర చేయడానికి అంగీకరించారు అనే టాక్ వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ డీఎంకే అధినేత కరుణానిధిగా కనిపిస్తున్నారు.