బాహుబలి ని నమ్మి మోసపోతున్న తెలుగు సినిమాలు

Sirini Sita
బాహుబలి బాలీవుడ్ లో 500 కోట్లు పై చిలుకు వసూళ్లు సాధించిన తర్వాత పాన్‌ ఇండియా సినిమాలు తీసేసి హిందీ మార్కెట్‌ని కూడా సొంతం చేసుకోవాలనే ఆరాటం మన నిర్మాతలలో పెరిగింది .కానీ  హిందీలో పాగా వేయడం అంత సులభం కాదని సైరాకి వచ్చిన స్పందనతో మన తెలుగు ఇండస్ట్రీ కి తెలిసింది  అయితే ఈ క్రమంలో ఇంతకుముందు అతి పెద్ద మార్కెట్లుగా మన  నిర్మాతలకి ధీమాగా వున్న కర్నాటక, ఓవర్సీస్‌ మార్కెట్లు కూడా  గణనీయంగా తగ్గిపోయాయి.

గతంలో కర్ణాటక లో మన తెలుగు సినిమా బాగా ఆడేవి. కారణం ఏదయినా కానీఎప్పుడు  కర్నాటకలో తెలుగు సినిమాలు గతంలో మాదిరిగా ఆడడం లేదు. సాహో, సైరా చిత్రాలపై భారీ రేట్లు పెట్టిన బయ్యర్లు దారుణంగా దెబ్బ తిన్నారు. ఓవర్సీస్‌లో సైరాని రీజనబుల్‌ రేట్లకే ఇచ్చినా కానీ నష్టం తప్పలేదు. దీంతో ఇక మీదట తెలుగు సినిమాలకి కర్నాటక, ఓవర్సీస్‌ నుంచి కనీసం పదిహేను కోట్ల లోటు పడుతుంది.

ఇంతకాలం ఇంత బిజినెస్‌ జరుగుతుందనే ధీమాతో ఖర్చు పెట్టి, హీరోల పారితోషికం కూడా అందుకు అనుగుణంగా పెంచేసిన నిర్మాతలు ఇక మీదట జాగ్రత్త పడాలి.కానీ కోసం మెరుపు ఎం అంటే సినిమాలు థియేటర్ లో ఆడకపోయినా టీవీ లో మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు .దీనితో టీవీ  రైట్స్ బాగా అమ్ముడుపోతున్నాయి ఇది ఒకటే నిర్మాతకి కోసం మెరుపు .

బిజినెస్‌లో పదిహేను కోట్ల లోటు అంటే నిర్మాతకి మిగిలే లాభం కంటే చాలా ఎక్కువ. కాబట్టి నిర్మాత గట్టున పడాలంటే అర్జంటుగా పారితోషికాలు తగ్గించడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా అదుపులోకి తీసుకురావాలి. తెలుగు సినిమా మార్కెట్‌ గణనీయంగా పెరిగిపోయిందనే బబుల్‌ బరస్ట్‌ అయి వాస్తవం బోధ పడడంతో ఇక మీదట భారీ సినిమాలు తీసే నిర్మాతలంతా జాగ్రత్త పాటించాల్సి వుంటుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: