తమన్నా గురించి అన్న ఒక మాట.. తమ్ముడు ఒక మాట..!

shami
మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ధ కాలంగా కెరియర్ లో ఫాం కొనసాగిస్తూనే ఉంది. ఈమధ్య కొద్దిగా కెరియర్ వెనక్కి తగ్గినట్టు అనిపించినా సరే మళ్లీ అమ్మడు ఈ ఇయర్ ఫుల్ ఫాంలో ఉంది. ఇయర్ మొదట్లో ఎఫ్-2 అంటూ సూపర్ హిట్ అందుకున్న తమన్నా రీసెంట్ గా వచ్చిన సైరా సినిమాలో కూడా హిట్ అందుకుంది.


ఇక త్వరలో రిలీజ్ అవుతున్న రాజు గారి గది 3 సినిమాలో కూడా తమన్నా నటించాల్సింది కాని షూటింగ్ మొదలయ్యే టైంకు ఆమె హ్యాండి ఇచ్చింది. సినిమా ఓపెనింగ్ తమన్నాతోనే చేయగా మొదటి షెడ్యూల్ నుండే తమన్నా సినిమా నుండి బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎవరు ఏమి మాట్లాడలేదు.


తమన్నా ప్లేస్ లో అవికా గోర్ వచ్చి చేరింది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అవికా గోర్ ను పొగుడుతూ అసలేమాత్రం ఇబ్బంది పెట్టకుండా అవికార్ గోర్ సపోర్ట్ చేసిందని ఓంకార్ అన్నాడు. అంటే ఆయన మాటల్లోని అర్ధం ఏంటంటే తమన్నా ఇబ్బంది పెట్టిందనే ఆమెను ఉద్దేశించే అలా అన్నాడని అనుకున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో అశ్విన్ మాత్రం తమన్నా కేవలం డేట్స్ అడ్జెస్ట్ లేకపోవడం వల్లే సినిమా నుండి తప్పుకుందని అన్నాడు.


తమన్నా గురించి ఓంకార్ ఇండైరెక్ట్ గా అలా అంటే.. అశ్విన్ మాత్రం ఓపెన్ గానే చెప్పేశాడు. అయితే తమన్నా ఉంటే ఎలా ఉండేదో చెప్పలేం కాని అవికా మాత్రం తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందని చెబుతున్నాడు అశ్విన్. రాజు గారి గది సినిమా ఊహించని విజయం అందుకోగా ఆ తర్వాత వచ్చిన రాజు గారి గది 2 సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఆ సినిమాలో నాగార్జున, సమంత ఉన్నా సరే సినిమా హిట్ అవలేదు. అయితే రాజు గారి గది 3 మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: