40 వయసులో కూడా బికినీ అందాలతో రెచ్చిపోతున్న భామలు !

Prathap Kaluva

బాలీవుడ్ లో వయసుతో పని లేదు. 40 లో కూడా తమ బికినీ అందాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయగలరు. కినీలు ధరించి మరీ తమ పర్ఫెక్ట్ షేపులను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు.  ఈ భామలు అందరూ యోగా ఎక్స్ పర్ట్స్ కావడం గమనార్హం.మలైకా అరోరా వయసు 45 ఏళ్ళు.. అయినా ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ పాతికేళ్ళ వయసున్న భామలతో పోటీ పడగలదు. బికినీ వేయాలంటే మలైకానే ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.  మరో భామ మందిరా బేడి వయసు 47 సంవత్సరాలు. 


ఈమధ్యే ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. వయసు ఇరవై ఏడా.. నలభై ఏడా అనే విషయం అర్థం కాక చాలామంది జుట్టు పీక్కున్నారు.  ఇంకో భామ శిల్పా శెట్టి వయసు 44.  ఈ బ్యూటీ వయసు కూడా ఎప్పుడూ ఇరవై ఏళ్ళ క్రితమే ఆగిపోయింది.  పూజా బాత్రా విషయమే తీసుకుంటే వయసు 42. బికినీ వేసిందంటే కెవ్వు కేకే.  ఇక అమీషా పటేల్ విషయమే తీసుకుందాం.. వయసు 43 మొదటి నుంచి కాస్త చబ్బీగా కనిపించే బ్యూటీనే కానీ ఇప్పటికీ ఒక గ్రాము తగ్గకుండా పెరక్కుండా అదే ఫిగర్ మెయింటెయిన్ చేస్తోంది. 


జనాలు అమీషాను పట్టించుకోవడం లేదు కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ నంబర్ వన్ను.   ఇక మరో హాటు భామ మల్లికా షెరావత్.. వయసు 42..  ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అదేరకంగా ఉంది. పొరపాటున ఎక్కడైనా అమృతం దొరికితే తాగేసిందేమో కానీ ఒక్క గ్రాము కూడా పెరగదు.  ఈ లిస్టు ఇంకా చాలా చాలా ఉంది.  వీరిని ఇన్ స్పిరేషన్ తీసుకోవాలి అంటే అందరూ ఈ భామల్లా బికినీలు వేసుకొని తిరగమనే ఉద్దేశం కాదు. అంత ఫిట్ గా మెయింటెయిన్ చేసేందుకు ప్రయత్నించాలి అని. ఎందుకంటే ఫిట్ నెస్ ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: