సన్నీ లియోన్ కి కవల పిల్లలట..!!

Vasishta

మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. అదేంటీ.. ఇంత పెద్ద న్యూస్ ఇంత సీక్రెట్ గా ఎలా మెయింటైన్ చేసారు.. సన్నీలియోన్ గర్భం దాల్చడం తామెప్పుడూ చూడలేదే.. అనే సందేహం వస్తోందా..? మీ అనుమానం నిజమేనండీ.. ! అయితే మీ అనుమానం వెనుక కారణాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...!


సన్నీలియోన్ ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లల తల్లి. అవును.. 2017లో ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు సన్నీలియోన్ దంపతులు. మహారాష్ట్ర- లాతూర్ లోని ఓ అనాధాశ్రమం నుంచి 21 నెలల వయసున్న ఆడబిడ్డను తీసుకున్నారు. నిషా కౌర్ వెబర్ అని ఆమెకు పేరు పెట్టుకున్నారు. అప్పట్లో సన్నీ లియోన్ బిడ్డను దత్తత తీసుకోవడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పోర్న్ స్టార్ కు బిడ్డను దత్తత ఇవ్వడంపై నెటిజన్లు అనాథాశ్రమాన్ని తిట్టిపోశారు. అయితే పలువురు సెలబ్రిటీలు సన్నీకి అండగా నిలిచారు.


తాజాగా సరోగసీ పద్ధతి ద్వారా సన్నీ మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అద్దె గర్భం ద్వారా ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్టు తెలిసింది. వారిద్దరికీ ఆషేర్ సింగ్ వెబెర్, నోవా సింగ్ వెబెర్ అని పేర్లు పెట్టినట్టు సన్నీ లియోన్ దంపతులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే మేం ముగ్గురు పిల్లలకు పేరెంట్స్ అవ్వాలనుకున్నామని, ఇదంతా దేవుడి దయ అని ఆ జంట పేర్కొంది.


ఇటీవలికాలంలో చాలా మంది సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. టాలీవుడ్ లో మంచు లక్ష్మి సరోగసి ద్వారానే పాపను కనింది. బాలీవుడ్ లో ఈ సంఖ్య పెద్దదే. షారూఖ్, అమీర్.. తదితరులెంతో మంది సరోగసిని ఎంచుకున్నారు. తాజాగా సన్నీలియోన్ కూడా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: