ఆమె నాకంటే సెక్సీ గా ఉంటుంది అంటున్న తాప్సీ...!

Prathap Kaluva
తాప్సి ని చూస్తే కుర్ర కారు గుండెల్లో చిచ్చు రేగాల్సిందే.  ఈ అమ్మడు చాలా తెలుగు సినిమా ల్లో నటించింది అయితే ఏ సినిమా కూడా తనకు బ్రేక్ ఇవ్వలేక పోయింది. ఒక్క హిట్ పడిన తెలుగు లో తన అదృష్టం మారిపోయుండేది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు  వేరే హీరోయిన్ ను పొగుడుతుంది. అయితే తెలుగులో గ్లామర్ అందాలని ఓ లెవెల్ లో చూపించిన తాప్సి నార్త్ లో మాత్రం లెవెల్ ని బ్రేక్ చేసింది.

ఏకంగా బికినీ వేసి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా ఎప్పుడు లేని విధంగా ఆఫర్స్ ని కూడా చాలా ఎక్కువగా అందుకుంటోంది. జుడ్వా 2 లో అరబోసిన అందాలకు ఫలితం దక్కడంతో బ్యూటీ నెక్స్ట్ మంచి కథలను ఎంచుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే తాప్సి కి బాలీవుడ్ లో ఒక హీరోయిన్ ని చూస్తే చాలా ఈర్ష్య  కలుగుతుందట. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుందని అంతే కాకుండా  ఆమెది పర్ఫెక్ట్ బాడీ అని తెలిపింది. ఆమె ఎవరో కాదు. తనతో పాటు జుడ్వా 2 సినిమాలో నటించిన జాక్వాలిన్ ఫెర్నాండెజ్. ఈ భామ కూడా ఆ సినిమాలో తాప్సి కి గ్లామర్ లో గట్టి పోటీని ఇచ్చింది.

అయితే రీసెంట్ గా దిల్ జంగల్  సినిమా ప్రమోషన్ లో మీడియా నుంచి ఎదురైనా ప్రశ్నకు జాక్విలిన్ ని  చూస్తే చాలా జలస్ గా ఉంటుందని తనదైన శైలిలో చాలా పాజిటివ్ గా స్పందిచింది.  ఇక దిల్ జంగల్ ట్రైలర్ రీసెంట్ గా  రిలీజ్ అయ్యి మంచి హైప్ ని క్రియేట్ చేసింది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక తెలుగులో కూడా తాప్సి ఓ సినిమాకు ఒప్పుకుంది. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కబోయే ఒక వినూత్న కథలో సొట్ట బుగ్గల సుందరి కీలక పాత్ర చేయబోతోందట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: