చరణ్ ఆఫీస్ ను పక్కకు పెట్టిన పవన్ ?

Seetha Sailaja
పవన్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ తరువాత బ్రేక్ తెసుకుని  రాజకీయాల గురించి ఆలోచిస్తూ  ప్రజల మధ్య పాదయాత్ర చేస్తాడు  అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తాల మధ్య పవన్ సినిమాలకు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వస్తున్న మరో కొత్త టాక్ అందరికీ షాక్ ఇస్తోంది. ఫెయిల్యూర్ దర్శకుడి గాబ్రాండింగ్ వేయించుకున్న సంతోష్ శ్రీనివాస్ బుట్టలో పవన్ పడ్డాడు అన్నవార్తలు ఇప్పటికే ఉన్నాయి.  

వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రి మూవీస్ సంస్థ ఈసినిమా తీయబోతోంది అని వార్తలు వచ్చిన విషయానికి మరింత బలం చేకూరిస్తూ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘రంగస్థలం’ ఆఫీస్ పక్కన పవన్ ఆఫీసు ప్రారంభించారు అని వార్తలు రావడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఈసినిమాకు ఇచ్చిన అడ్వాన్స్ ను పవన్ తిరిగిచ్చేస్తున్నాడని టాక్ వినిపించిన కొన్నాళ్ళకే ఇప్పుడు వారితో సినిమా చేయడానికి సీక్రెట్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. 

త్రివిక్రమ్ తో తప్పించి పెద్దగా స్టార్ డైరక్టర్లతో పనిచేయని పవన్ గతంలో ఒకసారి సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథకు ఓకే అన్నాడనే టాక్ వచ్చింది.  ఈమూవీలో నటిస్తే పవన్ కు 40 కోట్ల భారీ పారితోషికాన్ని మైత్రి మూవీస్ సంస్థ ఆఫర్ చేసింది అనే వార్తలు కూడ ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ తెరిచి అక్కడ సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఒక రచియితల టీమ్ చేత కథను రెడీ పెట్టిస్తున్నారట. పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఈ కథను వింటాడట. 

ఒక్కసారి పవన్ ఓకె అంటే వెంటనే షూటింగ్ మొదలు అని అంటున్నారు   మైత్రి యూనిట్ వర్గాలు. ప్రస్తుతానికి ఈస్టోరీ సిట్టింగ్స్ గురించి ఎవ్వరికీ తెలియకుండా కాపాడే ప్రయత్నంచేస్తూన్న ఈవ్యహారాలు నడుస్తున్నది చరణ్ ‘రంగస్థలం’ ఆఫీస్ పక్కన కావడంతో ఈలీకులు వస్తున్నాయి అని అంటున్నారు. అయితే చరణ్ సినిమాను పవన్ సినిమాను నిర్మిస్తున్నది ఒకే మైత్రి సంస్థ అయినా ఇలా వీరిద్దరికీ వేరువేరు ఆఫీస్ లు ఎందుకు పెటారు అన్నది చాలామందికి అర్ధం కాని ప్రశ్న.. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: