దెయ్యం సినిమాకు సెంటిమెంట్ వర్క్ ఔట్ అయ్యింది..!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయిన లారెన్స్ ‘ముని’తో మొదలు పెట్టిన హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. లారెన్స్ నటించిన కాంచన, గంగ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రాలు ఒకటీ రెండు తప్ప చాలా వరకు మంచి విజయాలు సాధిస్తూ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించాయి.  తాజాగా ఇదే సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ‘ఆనందో బ్రహ్మ’కు కాసులు కురుస్తున్నాయన్నది ట్రేడ్ టాక్.

గత కొంత కాలంగా హీరోయిన్ తాప్సికి మంచి హిట్స్ లేవు..ఆ మద్య లారెన్స్ నటించిన ‘గంగ’ చిత్రంలో మంచి మార్కులు తెచ్చుకున్న తాప్సి మరో హర్రర్, కామెడీ సినిమాతో విజయం సాధించింది.  వాస్తవానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ టైప్ చిత్రాలకు మంచి కథ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి.  అయితే ఆనందో బ్రహ్మ చిత్రంలో  నలుగురు టాప్ కమెడియన్స్ తమదైన హాస్యంతో మెప్పించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందనే చెప్పొచ్చు.

సాధారణంగా ఇలాంటి సినిమాల్లో మనుషులతో దెయ్యాలు ఆడుకోవడం భయపెట్టడం చూస్తుంటాం.. కాకపోతే ఈ చిత్రంలో రొటీన్ కి భిన్నంగా  క్యారెక్టర్లే దెయ్యాలను భయపెడుతున్నాయనే పాయింట్ ఈ సినిమాకు ఎసెట్ అయ్యిందంటున్నారు. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓవర్సీస్‌లో వీకెండ్‌కు కోటీ 90 లక్షలు ( 2 లక్షల 95 వేల డాలర్లు) వసూలు చేసి లాభాలబాట పట్టిందని అంటున్నారు. తాప్సీ,   శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆనందో బ్రహ్మ నిజంగానే దర్శక నిర్మాతలకు ఆనందాన్ని పంచినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు భావిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: