వైరల్ అయిన కత్రినా కైఫ్ ఫోటో..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన కత్రినా కైఫ్ కి సంబంధించి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించినట్లు...ఇలా రక రకాల పుకార్లు షికార్లు చేశాయి.  తాజాగా కత్రినా కైఫ్ ఒకప్పుడు లిబియా నియంత..క్రూరుడు అని పేరు తెచ్చుకున్న మహమ్మద్ గడాఫీతో తీయించుకున్న ఫోటో మోడల్ షమితా సింఘా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘సుమారు పదిహేనేళ్ల క్రితం మేమందరం లిబియాలో జరిగిన ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్లాం. అప్పట్లో లిబియాలో   నిర్వహించిన ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోకు అతిథిగా గడాఫీ హాజరైన సందర్భంలో అందాల భామలు ఆయనతో ఈ ఫొటో దిగారు.  ఇక మహమ్మద్ గడాఫీ ఎన్నో సంచలన కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.  

లిబియా నియంత గడాఫీ శృంగార పురుషుడని, తన హయాంలో పలువురు అమ్మాయిలతో సంబంధాలు ఉండేవని చెబుతుంటారు. లిబియా సివిల్ వార్ లో రెబెల్ మిలీషీయా చేతుల్లో  2011 అక్టోబర్ 20న గడాఫీ హతమయ్యారు.  ఈ ఫొటోలో కత్రినా కైఫ్, నటి నేహా ధూపియా, అదితి గోవిత్రికర్, అంచల్ కుమార్ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: