పవన్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

shami
తను స్థాపించిన జనసేన పార్టీ తరపున 2019లో పూర్తిస్థాయిలో రాజకీయ ప్రక్షాళన చేయాలని చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇక తమిళ దర్శకుడు నేసన్ డైరక్షన్ లో ఓ మూవీతో పాటుగా మరో సినిమా చేసి 2018 సంవత్సరం మధ్యలో నుండి పూర్తిగా ప్రచారం మీద దృష్టి పెట్టనున్నాడట.  


ఈ క్రమంలో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్న పవర్ స్టార్ నేసన్ డైరక్షన్ లో సినిమా క్యాన్సిల్ చేసుకుని సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ కు 40 కోట్ల దాకా ముట్టచెబుతున్నారట. 


కేవలం డబ్బు కోసమే పవర్ స్టార్ ఈ సినిమా చేస్తున్నాడని చెప్పొచ్చు. పవన్ ఓకే అంటే తనతో సినిమా తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే వారిని పక్కనపెట్టేసి సంతోష్ శ్రీనివాస్ తో సినిమా తీయడం ఫ్యాన్స్ కు మింగుడు పడట్లేదు. అసలు కాటమరాయుడు సినిమా కూడా డాలి డైరక్షన్ లో చేస్తున్నాడని ఫ్యాన్స్ కాస్త అసహనం చూపించారు.


ఇక రిజల్ట్ చూశాక అదే నిజమైంది. మరో పక్క మళ్లీ పవన్ కళ్యాణ్ సంతోష్ డైరక్షన్ లో కేవలం రెమ్యునరేషన్ చూసుకునే ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. కందిరీగ సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగర్ రభస ఫ్లాప్ చవిచూడగా లాస్ట్ ఇయర్ రామ్ తో చేసిన హైపర్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి అలాంటి డైరక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: