అమ్మడి ఆశలన్ని శర్వానంద్ మీదేనా..!

shami
ప్రస్తుతం యువ హీరోల్లో సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగితున్న హీరో శర్వానంద్. హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న శర్వా సినిమా మీద ఓ క్రేజీ హీరోయిన్ చాలా ఆశలు పెట్టుకుంది. యువత, కందిరీగ సినిమాల్లో అలరించిన అక్ష ప్రస్తుతం శర్వానంద్ హీరోగా చేస్తున్న సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. హీరోయిన్ గా కాకపోయినా అమ్మడి పాత్ర సినిమాలో చాలా స్కోప్ ఉన్నదిగా తెలుస్తుంది.


ఇక కొద్దికాలంగా కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేని అక్ష ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. మళ్లీ తనకు ఈ సినిమాతో మంచి రోజులొస్తాయనే నమ్మకంతో ఉంది అక్ష. ఇప్పటికే హీరోయిన్ గా క్రేజ్ సంపాదించినా సినిమాల సెలక్షన్స్ లో అమ్మడు తప్పటడుగులు వేసింది. ఈ క్రమంలో హీరోయిన్ గా కాకుండా వచ్చిన చిన్న చితకా వేశాలను వేసుకుంటూ వచ్చింది. 


తెలుగు వారికి తెలిసిన ఫేస్ కాబట్టి అక్ష మళ్లీ క్లిక్ అవడానికి ఓ హిట్ సినిమా కావాలి. అది శర్వా సినిమానే అంటున్నారు. శతమానం భవతి హిట్ తో కుర్ర హీరోల్లో తన సత్తా చాటుతున్న శర్వా చంద్రమోహన్ డైరక్షన్ లో ఈ మూవీ చేస్తున్నారు. బివిఎస్సెన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా అక్ష సెకండ్ లీడ్ గా నటిస్తుంది.  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: