హ్యాట్రిక్‌పై గురి పెట్టిన యంగ్ హీరో

Chowdary Sirisha
ప్రేమ‌కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయికుమార్ త‌న‌యుడు ఆది. ల‌వ్లీ కూడా హిట్ బాట ప‌ట్ట‌డంతో ఇప్పుడు ఆయ‌న దృష్టి హ్యాట్రిక్‌పై ప‌డింది. సుకుమారుడుతో వ‌రుస‌గా మూడో విజ‌యం అందుకోవాల‌ని ఆది త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. త‌న‌కు మంచి ప్యాడింగ్ కూడా కుదిరింది. పిల్లజ‌మిందార్‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ఆశోక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అంతే కాదు.. యూత్‌ని త‌న బాణీల‌తో క‌ట్టిప‌డేస్తున్న అనూప్ స్వ‌రాలు అందించాడు. మొత్త‌ంమ్మీద ఆది త‌న కెరీర్‌ని చాలా శ్ర‌ద్ధ‌గా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ వ‌య‌సులో త‌న‌కు స‌రిప‌డా క‌థ‌లు ఎంచుకొంటున్నాడు. అందుకే అత‌ని ముంగిట్లో హ్యాట్రిక్ సాధించే అరుదైన అవ‌కాశం ల‌భించింది. మ‌రి దాన్ని అందుకొంటాడా? లేదా ? అనేది చూడాలి. అన్న‌ట్టు ఈసినిమా మే 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: