టుడే ఫిల్మ్ రౌండప్ : సెప్టెంబర్ 28

shami

తండ్రైన అల్లరోడు : 


అల్లరి నరేష్ కు ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పాలి.. గతేడాది విరూపను వివాహమాడిన నరేష్ ఈరోజు ఓ పాపకు తండ్రి కావడం జరిగింది. ఇక ఈ సంతోషాన్ని అందరికి ఎనౌన్స్ చేస్తూ తాను ఓ ట్వీట్ కూడా చేశాడు. 


ఇక అల్లరి నరేష్ కు పాప పుట్టిన సందర్భంగా నాని కూడా ఓ కామెడీ ట్వీట్ వేశాడు. ఓ పాప స్కూల్ లో బాగా అల్లరి చేస్తుంటే ఏ పాప మీ నాన్న పేరేంటి అని టీచర్ అడిగితె పాప అల్లరి నరేష్ అని చెబుతుందట. కంగ్రాట్స్ బాబాయ్ అంటూ తన సందేశాన్ని అందించాడు నాని.


సెన్సార్ కంప్లీట్ చేసుకున్న సునీల్ సినిమా : 


హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో సునీల్ పడని కష్టం లేదు.. ఈ సంవత్సరం ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన కృష్ణాష్టమి కూడా పోవడంతో ప్రస్తుతం రానున్న ఈడు గోల్డ్ ఎహే మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు సునీల్.  


వీరు పోట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మించారు. ఈరోజు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యు.ఏ సర్టిఫికేట్ అందుకుంది. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న రిలీజ్ అవుతుంది.


రామ్ హైపర్ జీ తెలుగు సొంతం : 


మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న రామ్ హైపర్ సినిమాకు జోష్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వారు 6.3 కోట్లకు కొనేశారట. ఓ రకంగా రామ్ కెరియర్ లో ఇదో బెస్ట్ శాటిలైట్ సేల్ మూవీ అని చెప్పాలి. కందిరీగ హిట్ తో క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ ఏ రేంజ్ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


14 రీల్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం రామ్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అసలు విషయం ఏంటి అని తెలియాలంటే సరిగ్గా 48 గంటలు ఆగితే సరిపోతుంది. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: