టుడే మూవీ రౌండప్ : సెప్టెంబర్ 19

shami

సుమంత్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ :


అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా నరుడా డోనరుడా.. బాలీవుడ్ మూవీ విక్కి డోనార్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు నాగార్జున రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే సినిమాను సుమంత్ స్వయంగా నిర్మించడం.
ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే తానో స్పెర్మ్ డోనార్ అని ఇంప్రెస్ చేస్తున్న సుమంత్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి. అక్కినేని ఫ్యామిలీల్లో తన తర్వాత వచ్చిన హీరోలేమో మంచి హిట్లు కొడుతుంటే సుమంత్ ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటినా చేతి వేళ్లతో లెక్కపెట్టగలిగే ఒకటో రెండో హిట్లు అందుకున్నాడు. మరి ఈసారి గురి తప్పకుండా వస్తున్న సుమంత్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. 


సింగం 3 రిలీజ్ డేట్ ఫిక్స్ :


విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న సింగం సీరీస్ ఎస్-3 షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. హరి డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా ముందు రెండు సినిమాల కంటే ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. అనుష్క శృతి హాసన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అని తెలుస్తుంది.
అసలైతే సినిమాను కోలీవుడ్లో దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన చేశారు. కాని సూర్య తమ్ముడు కార్తి కాష్మోరాగా రాబోతున్న సందర్భంగా ఎస్-3 మూవీని డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది.


దూకుడు సెంటిమెంట్ తో హైపర్ :


సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు నిర్మించిన బ్యానర్ 14 రీల్స్ వారే ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్లో హైపర్ మూవీ నిర్మించారు. ఈ నెల 30న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తారీఖు రిలీజ్ చేయనున్నారు. అయితే అదే రోజు దూకుడు 5వ సక్సెస్ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోనున్నారు.
మహేష్ సినిమాతో పబ్లిసిటీ చేస్తే ఇంకాస్త ఆడియెన్స్ కు దగ్గర అవుతుంది అనే ఉద్దేశంతో హైపర్ ట్రైలర్ దూకుడికి లింక్ పెట్టేశారు దర్శక నిర్మాతలు. ఇక సంతోష్ శ్రీనివాస్ రాం కాంబినేషన్లో కందిరీగ సినిమా మంచి హిట్ సాధించింది. మరి అదే హిట్ మ్యాజిక్ హైపర్ సినిమాకు వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.


120 కోట్ల గ్రాస్ తో జనతా గ్యారేజ్ :


బాహుబలి తర్వాత తెలుగు సినిమాల స్టామినా నిజంగానే పెరిగింది. బాహుబలి వెంటనే రిలీజ్ అయిన శ్రీమంతుడు ఏకంగా నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేసి సరికొత్త సంచలనం సాధించింది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ కూడా అదే దిశలో వెళ్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే120 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించీందట జనతా గ్యారేజ్.
అయితే బాహుబలి తర్వాత అంతే ఫాస్ట్ గా ఇంత పెద్ద గ్రాస్ ను సాధించింది మాత్రం జనతా గ్యారేజే. ఫైనల్ గా మాత్రం శ్రీమంతుడు 86 కోట్ల షేర్ రాబట్టింది. సో అది క్రాస్ చేస్తే జనతా గ్యారేజ్ సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఇప్పటివరకు జనతా 80 కోట్ల కలక్షన్స్ షేర్ వచ్చాయి. మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: