షాక్ ఇస్తున్న హీరో రామ్.. బ్లైండ్ క్యారక్టర్ లో సవాల్..!

shami
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నేను శైలజతో సత్తా చాటి తన క్రేజ్ ఏంటో చూపించుకున్నాడు. తన కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకున్న రామ్ ఇక నుండి రొటీన్ ఫార్ములా సినిమాలకు స్వస్థి చెప్పి ప్రయోగాలకు పెద్ద పీట వేయనున్నాడు. అయితే ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ లో బ్లైండ్ క్యారక్టర్ లో నటిస్తున్నాడని షాక్ ఇచ్చాడు. గుడ్డివాడిగా రామ్ ఊహించుకోవడం కష్టమే కాని తనే విషయాన్ని రివీల్ చేశాడు రామ్.   


ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు రామ్. అయితే ఆ సినిమాలో తనది బ్లైంట్ క్యారక్టర్ అని అంటున్నాడు. మరి హీరో బ్లైండ్ రోల్ అది రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఎలా సాధ్యం అని డౌట్ పడుతున్నారు.


ఇక ఇదే విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి కూడా చెప్పాడు. హీరో గుడ్డివాడైనా కమర్షియల్ గానే ఉంటుంది.. ఓ ప్రయత్నం చేస్తున్నామంటూ ట్వీట్ చేశాడు. సో అనీల్ రావిపూడి రామ్ తో ఓ ప్రయోగం చేస్తున్నాడన్నమాట. మొన్నటిదాకా మూస సినిమాలతో ఫ్లాపులు మూటకట్టుకున్న రామ్ శైలజ హిట్ తో ఉత్సాహంగా ప్రయోగాలు చేస్తున్నాడు. 


మరి ఈ ప్రయోగాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం చేస్తున్న సంతోష్ శ్రీనివాస్ సినిమా ఇంటర్వల్ సీన్స్ షూట్ చేసే పనిలో ఉన్నారట. 14 రీల్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా మరోసారి రామ్ కు కందిరీగ లాంటి హిట్ ఇస్తుందంటున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.     మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: