నానీ - రామ్ లని నమ్ముకున్న డైరెక్టర్ లు

KSK

 

ఎక్కడైనా దర్శకుడు హీరో కి హిట్ ఇవ్వాలి కానీ ప్రస్తుత పరిస్థితి హీరోలే దర్శకులకి హిట్ ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. సీన్ రివర్స్ అయిన ఈ డైరెక్టర్ లు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ప్లాప్ బాట పట్టిన డైరెక్టర్ లని ఆదుకోవాల్సిన పని హీరోల చేతిలో పడింది. తన గాడ్ ఫాథర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ కి టైం బాలేని సమయంలో ఒక సినిమా ఇచ్చాడు నాని " జెంటిల్ మెన్ " గా ఈ వారాంతం లో రాబోతున్నాడు.

 

అల్లరి నరేష్ తో అట్టర్ ప్లాప్ కొట్టి అంతకుముంది సినిమాలు కూడా నిరాశ పరిచిన మోహన్ కృష్ణ ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనీ మళ్ళీ ఫార్మ్ లోకి రావాలి అనీ ఆశ పడుతున్నాడు. తన గురువు, గాడ్ ఫాథర్ అయిన ఇంద్రగంటే నాని కి తొలి సినిమా తో హిట్ ఇచ్చాడు . ఆ ఎఫెక్షన్ ఉన్న నాని అయన టాలెంట్ ని గట్టిగా నమ్ముతాడు. అదే ఆలోచనతో ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. తన కెరీర్ బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ లు కొట్టి మంచిగా నడుస్తున్నా కూడా పెర్ఫెక్ట్ టైం లో రిస్క్ తీసుకున్న నాని కి చాలా మంది ఈ సినిమా విషయం లో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వారాంతం లో జాతకం తేలబోతోంది.

 

అలాంటి మరొక డైరెక్టర్ - హీరో ప్రాజెక్ట్ సంతోష్ శ్రీనివాస్ - హీరో రామ్ తో అని చెప్పాలి. కందిరీగ తో రామ్ కి సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఎన్టీఆర్ లాంటి బడా హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేక అట్టర్ డిజాస్టర్ ఇచ్చాడు. ఈ పరిస్థితి లో వారిద్దరూ కొత్త సినిమా మొదలు పెట్టారు.షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా సాగుతోంది. దసరా కి విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు. సో ఈ సినిమా విషయం లో కూడా డైరెక్టర్ కి హీరో దిక్కు అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: