హీరో కి హ్యాట్రిక్ హిట్ - డైరెక్టర్ కి హ్యాట్రిక్ హిట్ ?

KSK

పటాస్ సినిమాతో కళ్యాణ్ రాం కి కొత్త ఎలివేషన్స్ లో చూపించి డైరెక్టర్ అనిల్ రావిపూడి ' సుప్రీం ' తో మరొక సూపర్ హిట్ కొట్టాడు. ఈ డైరెక్టర్ తో రామ్ ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. ప్రస్తుతం నేను శైలజ సూపర్ హిట్ కొట్టేసిన రాం మంచి ఫార్మ్ లో ఉన్నాడు. తరవాత సినిమా తనకి కందిరీగ సూపర్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో సంతకం పెట్టేసాడు కూడా సో రాం ఆ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

 

తర్వాత సినిమా అనిల్ తో చెయ్యాలి అని దీంతో డైరెక్టర్ కీ , హీరో కీ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ లు పడిపోతాయి అని అనిపిస్తోంది. పటాస్ కానీ - సుప్రీం కానీ చాలా పెర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ లు రాసుకోవడం లో అనిల్ తన మార్కు చూపించాడు. కొత్త డైరెక్టర్ ఇంకా జాగ్రత్తగా సినిమాని తీసుకెళ్తూ కామెడీ ని కూడా జోడించి హిట్ కొట్టడం ఈ మధ్య కాలం లో చాలా రేర్ గా చూస్తున్నాం. ప్రతీ ఎమోషన్ నీ సమపాళ్ళలో రంగరించి పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ కాలం పట్టదు అని నిరూపించుకుంటున్నాడు అనిల్ రావి పూడి.

 

సో రాం తో హిట్ కొడితే వరసగా మూడు సూపర్ హిట్ లు కాబట్టి ప్రభాస్ , ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేద్దాం అని అతని ప్లాన్. అనిల్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి రామ్ నటించేందుకు అంగీకరించాడని సమాచారం. పూర్తి కమర్షియల్ హంగులతో ఒక మంచి లవ్ స్టోరీ ని అనిల్ ఈ సారి ఎంచుకున్నాడట. అయితే డైరెక్టర్ కీ - హీరో కీ హ్యాట్రిక్ సినిమా అవ్వబోతోంది అనమాట ఈ వెంచర్ .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: