టాలీవుడ్ కు రెడ్ బుల్ లాంటి హీరో..!

shami
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అంటేనే అదో రకమైన పాజిటివ్ ఎనర్జి వస్తుంది. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ సినిమాతోనే తనలోని సత్తా చాటుకున్నాడు. యువ రక్తంతో ఉర్రూతలూగించే రామ్యాక్టింగ్, డ్యాన్సుల్లో సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. దేవదాసు సినిమా తర్వాత సుకుమార్ జగడం సినిమాతో ఫ్లాప్ అందుకున్నా రామ్ కెరియర్ లో మోస్ట్ స్టైలిష్ సినిమా జగడం అని ఇప్పటికి చెబుతారు.   


రామ్ తండ్రి గారు మురళి మోహన్ పోతినేని.. బడా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ రామ్ కు పెదనాన్న అవుతారు. అందుకే రామ్ కు సపోర్ట్ గా స్రవంతి సంస్థ తన సినిమాలను నిర్మిస్తూ వచ్చింది. ఆ బ్యానర్ కు ఉన్న వాల్యూతో రామ్ ను హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు స్రవంతి రవికిశోర్.


ఇక రామ్ మూడో సినిమా రెడీ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఆ సినిమాతో కెరియర్ లో ఓ సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. అదే దారిలో మస్కా సినిమా చేసినా అది యావరేజ్ గానే మిగిలింది. ఇక ఆ తర్వాత చేసిన గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు రాంకు పజయాన్ని ఇచ్చాయి.  


అయితే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ సినిమా మరోసారి రామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కాని ఆ సక్సెస్ ను కూడా నిలబెట్టుకోలేకపోయాడు. కందిరీగ తర్వాత వరుస ఫ్లాపులను ఫేస్ చేశాడు. ఎందుకంటే ప్రేమంట, ఒంగోలుగిత్త, మసాల సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సంక్షోభంలో పడ్డాడు రామ్.


అయితే మూస పంథాలోనే పండుగ చేస్కో సినిమాతో హిట్ అందుకున్నా రామ్ ఎనర్జీకి తగ్గ సినిమాలు ఇవి కాదు అని గట్టిగా రూమర్లు వచ్చాయి. ఇక శివం సినిమాతో అసలు రాం కు ఏమైంది ఇలాంటి సినిమాలు చేస్తున్నాడని గాసిప్పులు బాగా వినపడ్డాయి. అందుకే కిశోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజ అంటూ ఓ సూపర్ లవ్ స్టోరీతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. తనను ఆడియెన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలా కనిపించి అలరించిన రామ్ నేను శైలజ సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.      


అయితే అదే జోష్ తో తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ లో హిట్లు, ఫ్లాపులు సమానంగా ఎదుర్కున్న రామ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి ఇలాంటి హ్యాపీ బర్త్ డేలు సక్సెస్ ఫుల్ పుట్టినరోజులు ఎన్నో మరెన్నో రావాలని కోరుకుంటూ రామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.   


రామ్ చిన్నప్పటి ఫోటోలు :