తమన్నాకు షాక్ ఇచ్చిన రామ్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. తర్వాత వచ్చిన సినిమాల్లో రెడీ తప్పా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలు హిట్ గా నిలువలేదు. గత సంవత్సరం వచ్చిన పండుగ చేస్కో చిత్రం మంచి విజయం సాధించింది..తర్వాత వచ్చిన శివమ్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో నిరాశలో ఉన్న రామ్ 'నేను...శైలజ' చిత్రంతో కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత ఇప్పటి వరకు రామ్ చిత్రం ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ కాలేదు. తాజాగా కందిరీగ చిత్రంతో రామ్ కు అదిరిపోయే హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు.

ఈ చిత్రం  14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్నట్లు ఆ మధ్య అఫీషియల్ గా కూడా లాంచ్ చేశారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నట్లు అయితే గతంలో రామ్ తో నటించిన తమన్నాను హీరోయిన్ గా తీసుకుంటే మంచి కాంబినేషన్ అవుతుందని భావించారట కానీ చివరి నిమిషంలో తమన్నాను హీరోయిన్ గా వద్దని ఆమె ప్లేస్ లో రాశీఖన్నా అయితే బాగుంటుందని రామ్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ప్రేమంట పోస్టర్


అయితే కారణాలు ఏవైనప్పటికీ రామ్ ఇప్పుడు మంచి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడన్నమాట..అయితే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: