మనీ: ఈ బ్యాంక్ ల్లో తక్కువ వడ్డీ కే రుణాలు..!

Divya
ప్రస్తుతం లోన్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని బ్యాంకులు శుభవార్తను అందించాయి ముఖ్యంగా మీరు ఏ ఏ బ్యాంకులో లోన్ పొందాలని అనుకుంటున్నారో ఆయా బ్యాంకులు లోన్ పై ఎంత మొత్తంలో వడ్డీ విధిస్తున్నాయి అనేది తప్పకుండా తెలుసుకోవాలి.. ముఖ్యంగా ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ లభిస్తుంది అనేది తెలుసుకుంటేనే మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది. అయితే బ్యాంకు ప్రాతిపదికను బట్టి రుణ రేట్లు కూడా మారుతాయి అని గుర్తించుకోవాలి.
ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభిస్తున్నాయి కాబట్టి 84 నెలల వరకు టేన్యుర్ పెట్టుకోవచ్చు. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభిస్తున్నాయి కాబట్టి 84 నెలల వరకు టెన్యూర్ తో లోన్ పొందవచ్చు అలాగే వడ్డీ రేటు 9.9% నుంచి ప్రారంభం అవుతోంది కాబట్టి గరిష్టంగా 14.75% వరకు వడ్డీ రేట్లు విధించబడుతున్నాయి.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారికి వడ్డీ రేటు 10% గా ఉంది.
ఇక ఇండస్ బ్యాంకు విషయానికి వస్తే 10.2 6% నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 60 నెలల వరకు టెన్యూర్ మీరు పెట్టుకోవచ్చు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 10 లక్షల వరకు లోన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 60 నెలల టెన్యూర్ కు 10.4% వడ్డీ ప్రారంభం అవుతుంది. అక్కడ 16.95% వరకు వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికి వస్తే లోన్ పొందాలనుకునేవారు 10.49% నుంచి 22 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. ఇక 60 నెలల టెన్యూర్ కి 40 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఏకంగా కోటి వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా 60 నెలల టెన్యూర్ కి 10.49 వరకు వడ్డీ రేటు పడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: