మనీ: కస్టమర్ల కోసం అదిరిపోయే శుభవార్త తెలిపిన ఎస్బిఐ..!

Divya
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కష్టమర్లకు తీపి కబురును అందించింది. కొత్త సర్వీస్ లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధం అవుతుంది. దీనివల్ల కస్టమర్లకి కూడా బెనిఫిట్ కలగబోతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎస్బిఐ ఐరిష్ స్కానర్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కు ఎక్కువగా దీనివల్ల బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు . పెన్షన్ పొందడానికి ఇకపై ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఈజీగానే పెన్షన్ ను పొందవచ్చు.. వయసు పెరుగుతున్న కొద్దీ ఫింగర్ ప్రింట్స్ లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఇక సీనియర్ సిటిజన్స్ ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.అందుకే ఇలాంటి వారి కోసమే పెన్షన్ పెంచడంలో ఇబ్బందులు రాకుండా ఐరిష్ స్కానర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ లేదా సర్వీస్ కస్టమర్ పాయింట్ల వద్ద ఐరీస్ స్కానర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఎస్బిఐ తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.  ఇకపోతే ఈ సర్వీసులు గనుక అందుబాటులోకి వస్తే బ్యాంకు కస్టమర్లకు మరొక బెనిఫిట్ కూడా ఉండబోతోంది.
ఇకపై సీనియర్ సిటిజెన్స్ బ్యాంకు యొక్క బ్రాంచ్లకు వెళ్లాల్సిన పని లేకుండా పెన్షన్ మొత్తాన్ని కూడా దగ్గర్లో ఉన్న బ్యాంకింగ్ మిత్ర ఛానల్ వద్దకు వెళ్లి విత్ డ్రా చేసుకొని వీలుంటుంది. ఇకపై బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన పని లేకుండా ఈ నిర్ణయం కష్టం వాళ్లకు ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లేదంటే కస్టమర్లు ఇబ్బందులు పడకుండా ఉండడానికి బీసీ లేదా సిఎస్పీ వద్ద ఐ రిషి స్కానర్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ఎస్బిఐ స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఎస్బిఐ తీసుకొచ్చిన  ఈ సేవలు కస్టమర్లకు మరింత ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: