మనీ: అదిరిపోయే స్కీమ్.. రూ.25 లక్షలకు పైగా ఆదాయం..!

Divya
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక అవసరాలు తీర్చడానికి అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల వల్ల చాలా రకాల బెనిఫిట్స్ కూడా మనం పొందవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. అద్భుతమైన రాబడిన అందించే పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. రిస్క్ లేకుండా లాభాలు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ స్కీంతో అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో పదేళ్ల లోపు ఆడపిల్లలను ఇందులో చేర్పించి మంచి రాబడి పొందవచ్చు.  ముఖ్యంగా టాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ పథకం ద్వారా లభిస్తాయి.  ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారి చదువులకు,  పెళ్లి ఖర్చులకు ఇతర అవసరాల కోసం ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకం పై మీకు కేంద్ర ప్రభుత్వం 7.6% వడ్డీ కూడా ఇస్తోంది . ఇక పూర్తి వివరాల్లోకెళ్తే 15 ఏళ్ల పాటు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది..
ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు..  మీరు ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెల మీరు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన మీకు మంచి లాభం ఉంటుంది. నెలకు రూ.5000 చొప్పున డిపాజిట్ చేయాలని చూస్తుంటే..  15 సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి రూ.60 వేల చొప్పున 15 సంవత్సరాల లో మీరు రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. వడ్డీ రూపంలో కలుపుకొని రూ.16.46 లక్షలు పొందవచ్చు. ఇక మొత్తం కలుపుకొని మీరు రూ.25 లక్షలకు పైగా లాభం పొందవచ్చు. ప్రతినెలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అనుకునేవారు.. ఈ పథకంలో చేరడం మంచి ఉత్తమమైన అలవాటు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: