మనీ: ఈ స్కీంలో చేరితే రూ.5 లక్షలకు పైగానే రిటర్న్స్..!

Divya
ప్రస్తుత కాలంలో డబ్బులు ఆదా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఆడపిల్లల తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా ఉండడానికే ఈ పథకం.
 ఈ పథకంలో చేరిన ఎంతోమంది ఆడపిల్లలు తమ భవిష్యత్తులో కొత్త మార్గాలను ఎంచుకోగలిగారు ఇకపోతే ఈ పథకం కింద మీకు 7.6% వడ్డీ కూడా లభిస్తున్న నేపథ్యంలో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను  తెరవచ్చు.
 ఆడపిల్లలు పుట్టినప్పటినుంచి పదేళ్లలోపు ఆడపిల్లల పేరు పోయిన వారి తల్లిదండ్రులు ఇసుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసి.. ప్రతినెలా కొంత డబ్బు దాచవచ్చు . అయితే 10 సంవత్సరాల దాటిన తర్వాత ఆడపిల్లలకు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు. అలాగే పదేళ్లలో ఆడపిల్లలకు తల్లిదండ్రులు అకౌంట్ ఓపెన్ చేస్తే ఆడపిల్లలు 18 ఏళ్లు వచ్చిన తర్వాత అకౌంట్ హోల్డర్ గా ఆటోమేటిక్గా మారిపోతారు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఇసుకన్నా సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసే వీలు ఉంటుంది.
అయితే ఒకే గర్భంలో ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినట్లయితే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఖాతాలో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లకు 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ స్కీం మెచ్యూర్ అవుతుంది కాబట్టి భారీ మొత్తంలో రిటర్న్స్ పొందుతారు ..తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం కనీసం ₹1000డిపాజిట్ చేసినా  సరే మంచి లాభం ఉంటుంది.  కేవలం వెయ్యి రూపాయల డిపాజిట్ తో రూ.5 లక్షలకు పైగా రిటర్న్స్ పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: