మనీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్ ఫ్రీ..!

Divya
తాజాగా 2023- 2024 బడ్జెట్ లో ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఈసారి బడ్జెట్ మీద చాలా మంది ఆశలు పెట్టుకోవడం గమనార్హం.. గత ఏడాదితో పోల్చితే ఈసారి చాలామందికి ఊరట కలుగబోతోంది అని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లకి కేంద్రం సబ్సిడీని భారీగా పెంచేలా మార్గాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం పూర్తి వివరాలను చూస్తే మనం.. పెరుగుతున్న గ్యాస్ ధరల వల్ల చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఇలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ చాలా అంటే చాలా ఆర్థిక ఇబ్బంది ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సామాన్యులు కూడా కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.  ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారుగా రూ.5,812 కోట్లు గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ కింద సిలిండర్ కు 200 రూపాయలను ఎల్పీజీ అందిస్తోంది. దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ పథకం యొక్క బెనిఫిట్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది.
దారిద్రరేఖకు దిగువనున్న ప్రజలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఈ స్కీం కింద ఇస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీఫిల్, స్టవ్ ని ఫ్రీగా ఇస్తారట . అలాగే రూ.1600 ఆర్థిక సహాయం కూడా చేయబోతారు అని తెలుస్తోంది. 2016లో మోడీ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించగా 2021 ఆగస్టు 10వ తేదీన ఉజ్వల 2.1 మొదలుపెట్టింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మిగతా కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  మరి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా ఊరట లభిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: