మనీ: అద్భుతమైన పాలసీతో ముందుకొచ్చిన ఎల్ఐసి.. రూ.10వేలతో రూ.4 లక్షలు ఆదాయం..!

Divya
ప్రస్తుతం భారత ప్రభుత్వ రంగ భీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో అద్భుతమైన పాలసీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారుల నుంచి పెద్దల వరకు రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి భవిష్యత్తును మరింత సులభతరం చేస్తున్నాయి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ బెన్ఫిట్ వచ్చే పాలసీలు చాలా ఉన్నాయి. చిల్డ్రన్స్ పాలసీ, మనీ బ్యాక్, టర్ము పాలసీ , ఎండోమెంట్ పాలసీ ,రిటైర్మెంట్ పాలసీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఇన్సూరెన్స్ పాలసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
అలాంటి వాటిల్లో ఇప్పుడు " ఆధార్ స్తంభ్ పాలసీ" కూడా ఒకటి. ఎల్ఐసి ఆధార్ స్తంభ్ పాలసీ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.  ముఖ్యంగా ఇది నాన్ లింక్డ్ పాలసీ లాభా పేక్షతో కూడిన ఎండోమెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు. మీరు నెలకు రూ.901 రూపాయలను ఆదా చేస్తే మీరు దాదాపుగా రూ.4 లక్షలు పొందే అవకాశం కూడా ఉంటుంది . కాబట్టి ఐదేళ్ల తర్వాత లాయల్టి ఆడిషన్స్ కూడా లభిస్తాయి. వయోపరిమితి విషయానికి వస్తే ఎనిమిది సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు.
మొత్తంగా ఈ పథకాన్ని రూ.75 వేల బీమా మొత్తంగా కనీసం తీసుకోవాలి గరిష్టంగా రూ.3 లక్షల వరకు తీసుకునే వేసనుబాటు కల్పించారు. అలాగే ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి పాలసీ తీసుకున్న వ్యక్తి తొలి ఐదు సంవత్సరాలలో మరణిస్తే పాలసీ మొత్తాన్ని నోమినికి అందజేస్తారు.  ఒకవేళ పాలసీదారుడు ఐదు సంవత్సరాల తర్వాత మరణిస్తే నోమినికి బీమా మొత్తం తో పాటు లాయల్టి ఆడిషన్స్ కూడా లభిస్తుంది.ఈ పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు. ఉదాహరణకు ఎనిమిదేళ్ల వయసులో రూ.3 లక్షలకు ఈ పాలసీ తీసుకుంటే తొలి ఏడాది ప్రీమియం కింద రూ.10,541 పే చేయాలి పాలసీ ముగిసిన తరువాత రూ. 4 లక్షలు మీ చేతికి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: