మనీ: రైతులకు శుభవార్త..13వ విడత అప్పుడే..!

Divya
తాజాగా రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం . ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన 13వ విడత ఈనెల ఆఖరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపి సర్కార్ కూడా రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూనే వస్తోంది. ఇందులో భాగంగా 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన ప్రతి రైతులకు కూడా ఏడాదికి రూ.6000 రూపాయల చొప్పున మూడుసార్లు రూ .2000 చొప్పున ఇవ్వబోతోంది.

ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యువజన పథకం  కింద 12 వాయిదాలను రైతులకు అందించగా ఇప్పుడు 13వ విడత కోసం లక్షలాది రైతులు ఎదురుచూస్తున్నారు జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రైతుల ఖాతాలో రూ.2000 రూపాయలను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.  మరొకవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే రైతులకు మరో గుడ్ న్యూస్ అందించడానికి సిద్ధమవుతోంది.  కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదు రూ.6000 నుంచి మరింత పెంచాలని ఆలోచన చేస్తోందట. ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ నగదును కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ.8వేలకు పెంచబోతున్నట్లు దీనిని అర్హులైన రైతుల ఖాతాలో నాలుగు సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రైతులకు ఆర్థికంగా అండగా నిలబడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: