మనీ: మహిళల కోసం అద్భుతమైన బిజినెస్ ఐడియాస్..!

Divya
ఇటీవల కాలంలో చాలామంది భారతీయ మహిళలు వ్యాపారవేత్తలు కావాలని కలలు కంటున్నారు. అందుకోసమే అనువైన వ్యాపారం కోసం వెతుకుతున్నారు. మీరు కూడా సొంతంగా తక్కువ ఖర్చుతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు. అదేమిటంటే మీకు వంట చేయడం బాగా వచ్చి.. వంట చేయడంపై ఆసక్తి ఉంటే కెచప్ మరియు సాస్ తయారీ చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఫాస్ట్ ఫుడ్ కి పెరుగుతున్న ఆదరణలో భాగంగా టమాటో కెచప్ మరియు సాస్ కి ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది.
ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ టమాటో కెచప్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాంటీన్లు,  రెస్టారెంట్లు , ఫుడ్ స్టాల్స్ , హోటల్లు లేదా ఇళ్లల్లో కూడా వీటిని ఉపయోగించడం వల్ల ఎక్కువగా డిమాండ్ పెరిగింది.  ముఖ్యంగా టమాటాల్లో మాలిక్ యాసిడ్ , సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.  వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో పేరుకు పోతాయి.  ఈ కారణంగానే పొట్టలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా ఈ టమోటా సాస్ కి డిమాండ్ తగ్గలేదు. అందుకే మీరు యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా ఎలా తయారు చేస్తారో తెలుసుకొని వీటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే తయారు చేయవచ్చు.
అయితే మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఎం ఎస్ ఎం ఈ పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని నమోదు చేయించుకోవాలి. మీరు ఆన్లైన్లో కూడా లైసెన్స్ పొందవచ్చు.  ఇది మీరు నమోదు చేసిన 15 రోజుల్లోపే లైసెన్స్ అందుకుంటారు. మీకు సమీపంలో ఉన్న హోటల్లు, కిరాణా దుకాణాలు, డాబాలు,  రెస్టారెంట్లు మొదలైన వాటితో ఒప్పందం కుదుర్చుకొని వాటిని అమ్మవచ్చు లేదా హోల్సేల్ వ్యాపారిని సంప్రదించి మీ ఉత్పత్తిని విక్రయించమని..అడగవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సహకారం సైతం మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు ఈ వ్యాపారంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద సుమారుగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. పైగా వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: