మనీ: డబ్బులు దాచుకోవడానికి అత్యంత సురక్షితమైన బ్యాంకులు ఇవే..!

Divya
ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు కోసం డబ్బులు సంపాదించాలి అని.. అలా సంపాదించిన డబ్బును దాచుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అని అనుమానాలు కూడా ఉంటాయి . ఒకవేళ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇకపోతే సామాన్య ప్రజల నుండి ఎవరైనా సరే డబ్బు దాచుకోవాలి అంటే అత్యంత సురక్షితమైన బ్యాంకులు ఇవే అంటూ దేశీ కేంద్ర బ్యాంకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక విషయాలను వెల్లడించింది.

దేశంలో ప్రజలు,  దేశ ఆర్థిక వ్యవస్థ ఈ బ్యాంకులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఈ బ్యాంకులు ఏమైనా అయితే.. ఆ ప్రభావం దేశం పైనే పడుతుందని పరోక్షంగా చెప్పవచ్చు.  రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ ఆర్బిఐ మోస్ట్ రిలైబుల్ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్.బి.ఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లి ఇంపార్టెంట్ బ్యాంకుల జాబితా పరిశీలిస్తే..  ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , హెచ్డిఎఫ్సి బ్యాంక్,  ఐసిఐసిఐ బ్యాంక్ వంటివి ఉన్నాయి. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకులను నిశితంగా గమనిస్తూ ఉంటుంది.
అంతేకాదు ఈ బ్యాంకులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది.  హెచ్డిఎఫ్సి బ్యాంకు పై ఆర్బిఐ గతంలో క్రెడిట్ కార్డుల జారీ నుంచి కొంతకాలం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఈ బ్యాంకులు వాటి రిస్క్ వెయిటేడ్ అసెట్స్ లో కొంత మొత్తాన్ని టైర్ వన్ ఈక్విటీలో ఉంచాల్సి ఉంటుంది. 2015 నుంచి కీలకమైన బ్యాంకులను నిశితంగా గమనిస్తూ వస్తోంది ఈ క్రమంలోనే ఈ మూడు బ్యాంకులు అత్యంత సేఫెస్ట్ బ్యాంకులుగా పరిగణించింది.  ఒకవేళ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ మూడు బ్యాంకులలో డబ్బు నిశ్చింతగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: