మనీ: ఈరోజు 2.79 లక్షల మంది ఖాతాలో డబ్బు జమ..!

Divya
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నగదు జమ చేయనున్నారు. 2,79,065 మందికి గాను సుమారుగా రూ.590.91 కోట్లు విడుదల చేయనున్నారు. ఇకపోతే తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి వారి ఖాతాలో డబ్బు జమ చేయనున్నారు. దీంతోపాటు జూన్ 2022 నుంచి నవంబర్ 2022 వరకు అర్హులైన వారికి పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు,. ఇళ్ల పట్టాలకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా ప్రస్తుతం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈనెల 30వ తేదీన తుది జాబితా ప్రచురించి.. జనవరి 1 నుంచి 2023న పెంచిన పెన్షన్ తో పాటు అన్ని కార్డులు,  ఇళ్ల పట్టాల పంపిణీ గ్రామ , వార్డు సచివాలయాల వాలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.  ప్రతిఏటా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సుమారుగా రూ.60 వేలకు పైగా లాభం పొందుతున్నట్లు సమాచారం. పెన్షన్ వదులుకొని నవరసాలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తమ ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు అర్హులై ఉండి డబ్బు ఖాతాలో జమ చేయని వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డబ్బు జమ చేయనున్నారు. ఏది ఏమైనా అర్హత ఉండి డబ్బు పొందని వారికి ఈరోజు డబ్బు జమ కాబోతోంది అని తెలిసి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి అండగా నిలుస్తోంది.  బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆసరాగా నిలుస్తూ ఆర్థికంగా వారిని ఆదుకుంటుంది.  ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: