మనీ: ఒక్క మిస్డ్ కాల్ తో రైతులకు లోన్..!!

Divya
ఈ మధ్యకాలంలో రైతులకు లోన్లు అందించడం మాఫీలు చేయడం వంటివి ప్రభుత్వాలు బాగానే చేపడుతున్నాయి. అయితే గతంలో లోన్స్ అనేవి ఎక్కువగా ఉద్యోగస్తులకు మాత్రమే ఒక్కరోజులోనే ఇస్తూ ఉండేవారు. కానీ గతంలో రైతులు అన్ని పక్కాగా ఇచ్చిన ఎన్ని రోజులకు లోన్ వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు టెక్నాలజీ మారడంతో అలాంటి కష్టాలకి చెక్ పెడుతూ తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ తో రైతులకు అందిస్తున్నట్లుగా ప్రకటించింది.

ప్రస్తుతం అన్ని బ్యాంకులకు కూడా రైతులకు సరికొత్త ఆఫర్లను ఇస్తూ ఉంది.రైతులకు ఎరువులు, విత్తనాలు నిత్యవసర సరుకుల కోసం బ్యాంకు తక్కువ వడ్డీతోనే రుణాలను మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే PNB బ్యాంకు కూడా రైతులను ఆకర్షించే సరికొత్త విధానాన్ని శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా మంజూరు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ట్విట్టర్ ఖాతా నుంచి రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను సైతం తెలియజేశారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వ్యవసాయ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాన్ని కూడా తెలుపుతోంది  అందుకు సంబంధించి పలు యూట్యూబ్ ఛానల్స్ లింకును కూడా షేర్ చేసింది.మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్ ను ప్రయోజనాలను పొందాలి అంటే సులభంగా దీనికోసం PNB అగ్రికల్చర్ లోన్ కింద దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకుని పద్ధతులను బ్యాంకు సులభంగా తెలియజేస్తోంది.
1). మీకు రుణం కావాలి అంటే..56070 కి LOAN ఆని SMS సెండ్ చేయొచ్చట.
2). ఇదే కాకుండా 18001805555 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లోన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
3). ఇదే కాకుండా నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ netpnb.com
ఇలా కేవలం ఒక్క మిస్డ్ కాల్ తోనే రైతులు లోన్ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: