మనీ: ఇలా చేశారంటే ప్రతి నెల ఆదాయం..!

Divya
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడానికి అనేకమార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోని డబ్బులు పెట్టుబడి పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ ఉత్తమమైన ఎంపిక అనీ చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆదాయంతో పాటు మన డబ్బుకు మంచి సెక్యూరిటీ కూడా లభిస్తుంది. అయితే ఈసారి మీరు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పెట్టడం కంటే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ ని తీసుకోవడం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ వ్యాపారం చేయడానికి మీ దగ్గర కేవలం రూ. 5000 పెట్టుబడి ఉంటే సరిపోతుంది. ఇండియా పోస్ట్ అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాబోయే పది రోజుల్లో 10 వేల కొత్త పోస్ట్ ఆఫీస్ లు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఇంటిలో లేదా మీ ఇంటికి సమీపంలో పోస్ట్ ఆఫీస్ తెరవడం వల్ల కూడా డబ్బు సంపాదించవచ్చు. మీకు దగ్గరలో స్థలం లేకపోతే మీ ఇంట్లో కూర్చుని పోస్ట్ ఆఫీస్ లు తెరిచే అవకాశం ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ  కోసం మీకు కేవలం రూ.5000 మాత్రమే పెట్టుబడి అవుతుంది.. ఇందులో రెండు రకాలు ఉంటాయి.  మీరు ఫ్రాంచైజీ అవుట్ లెట్ తీసుకోవడం లేదా మీరే ఏజెంట్గా మారడం. ఇందులో ఏది తీసుకున్న సరే మీకు మంచి ఆదాయం ఉంటుంది.  ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ కోసం అంత నెట్వర్క్ లేనప్పటికీపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> పోస్టల్ సర్వీస్ అవసరం ఉన్నచోట ఫ్రాంచైజీ మోడల్ ను ప్రారంభించవచ్చు. 15 రోజుల్లో మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి పూర్తి సమాచారం లభిస్తుంది. కాబట్టి దీని వివరాలు తెలుసుకొని మీరు ఇంట్లో ఉంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: