మనీ: ఈ సాగుతో లక్షాధికారి అవ్వాల్సిందే..!
ఏడాదికి ఏకంగా లక్షల్లో లాభాలను పొందవచ్చు . ఎకరం భూమిలో మీరు ఈ పంటలను వేసినట్లయితే సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం 400 గ్రాముల వరకు ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ బరువు ఉంటుంది. ఒక చెట్టుకు సుమారుగా 60 పండ్లు లభిస్తాయి. వీటి కిలో ధర మార్కెట్లో రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నుండి రూ.5000 వరకు సంపాదించవచ్చు. ఒక ఎకరానికి 17 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటవచ్చు. సంవత్సరానికి రూ. 70 లక్షల వరకు ఆదాయం వస్తుంది అని ఇప్పటికే లాభార్జన పొందిన రైతులు కూడా చెబుతున్నారు.
మొదట్లో పంట పెట్టడానికి మాత్రమే ఎక్కువ ఖర్చవుతుంది. ఆ తర్వాత పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. విరివిగా పండే ఈ పంట ద్వారా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు.. మీరు మరొక పంటను కూడా పండించుకోవాలనుకుంటే చెట్ల మధ్యలో కూడా ఏదైనా చిన్న చిన్న కూరగాయలను ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు రెండు రకాలుగా లాభం లభిస్తుంది.మొత్తానికైతే డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా చాలామంది లక్షణాధికారి అవుతున్నారు. మీరు కూడా వ్యవసాయం చేయాలి.. బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రభుత్వ సహాయంతో సబ్సిడీ తీసుకొని ఈ పంట మొదలు పెట్టవచ్చు.